బ్రేక్ ఫాస్ట్ లో ఇది ఉంటే వెయిట్ లాస్ నుంచి థైరాయిడ్ కంట్రోల్ వరకు ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతం!

ఇటీవల కాలంలో కోట్లాది మంది వెయిట్ లాస్, థైరాయిడ్, డయాబెటిస్ తదితర సమస్యలతో తీవ్రంగా మదన పడుతున్నారు.వీటి నుంచి బయటపడటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

 If You Have This In Breakfast You Have Many Benefits From Weight Loss To Thyroid-TeluguStop.com

అయితే చాలా సమస్యలను మంచి ఆహారం ద్వారానే నివారించుకోవచ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రెసిపీ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే వెయిట్ లాస్ నుంచి థైరాయిడ్ కంట్రోల్ వరకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను తమ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంతకీ ఆరోగ్యానికి మేలు చేసే ఆ రెసిపీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ప‌ది జీడిపప్పులు, రెండు టేబుల్ స్పూన్లు నల్ల ఎండు ద్రాక్ష, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్, వన్ టేబుల్ స్పూన్ మునగాకు పొడి, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి.చివరిగా జీడిపప్పు ఎండు ద్రాక్ష జ్యూస్ ను కూడా వేసి బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్ లో రాత్రంతా స్టోర్ చేసుకోవాలి.

మరుసటి రోజు ఈ ఓవర్‌ నైట్ ఓట్స్ లో అరకప్పు దానిమ్మ గింజలు, అర కప్పు యాపిల్ ముక్కలు యాడ్ చేసుకుని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాలి.ఈ ఓవర్ నైట్ ఓట్స్ ను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల అతి ఆకలి దూరమవుతుంది.మెటబాలిజం రేటు పెరుగుతుంది.దీంతో క్యాలరీలు త్వరగా కరిగి వేగంగా బరువు తగ్గుతారు.

అలాగే ఈ ఓవర్ నైట్‌ ఓట్స్ ను తీసుకోవడం వల్ల థైరాయిడ్ కంట్రోల్ లో ఉంటుంది.గుండె సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలు సహజంగానే అదుపులోకి వస్తాయి.మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.హెయిర్ ఫాల్ నుంచి విముక్తి లభిస్తుంది.

మరియు లివర్ సంబంధిత వ్యాధులు సైతం దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube