ఉల్లి, వెల్లుల్లి లేనిదే ఏ ఇల్లాలు వంట చేయదు అనేది యెంత నిజమంటే, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేంత పచ్చి నిజం.అవును.
ప్రతి ఒక్కరి వంటింట్లో ఇవి ఖచ్చితంగా వుంది తీరాల్సిందే.అయితే వీటితో కేవలం వంట మాత్రమే కాదు, మన ఒంటికి కూడా ఎన్నో ఉపయోగాలు వున్నాయి.
ఉల్లిలో విటమిన్-సి, విటమిన్-బి6, పోటాషియం ఫోలేట్ ఉంటాయి.ఇక వెల్లుల్లిలో వీటితో పాటు కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, కాపర్ వంటివి కారకాలు పుష్కలంగా లభిస్తాయి.
ఇకపోతే, అయితే వంటిల్లో స్టోర్ చేసిన ఉల్లి, వెల్లుల్లి అప్పుడప్పుడు మొలకలు రావడం మనం చూస్తూ ఉంటాము.ఈ క్రమంలో కొందరు ఆ మొలకల వరకు కట్ చేసి ఉపయోగిస్తుంటారు.
అయితే మొలకలను ఉపయోగించొచ్చా? లేదా? అనే విషయంలో పలు సందేహాలు వున్నాయి.నిపుణుల వివరాల ప్రకారం.
మొలకలు వున్నవి మంచిదేనా? కాదా? అనే విషయం తెలుసుకుందాం.సాధారణంగా మనం మట్టిలో నాటితే గాని చాలా వరకు మొలకెత్తవు.
కానీ ఉల్లి, వెల్లుల్లి మాత్రం ఎక్కడున్నా మొలకలు వస్తుంటాయి.నేలలో నాటకపోయినా సరే, వాటికి మొలకలు పెరుగుతాయి.
అందుకు కారణం కిచెన్‌లో ఉండే తేమ వాతావరణమేనని కారణమని పరిశోధకులు అంటున్నారు.
అవును.
ఉల్లి, వెల్లుల్లి మొలకెత్తేందుకు కాస్త తేమ వాతావరణం ఉంటే సరిపోతుందని వ్యవసాయ నిపుణులు చాలామంది అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇలా మొలకెత్తడం వల్ల వాటిలో ఎలాంటి టాక్సిన్లు విడుదల కావు.అయితే ఇలాంటి మొలకల వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు.మొలకల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది.
అందుకే వాటిని తీసుకోవడం కూడా మంచిదేనంటున్నారు నిపుణులు.అయితే ఈ మొలకలు నేరుగా తింటే కాస్త చేదుగా అనిపించవచ్చు.అందుకే మొలకలు వచ్చినవి కూరల్లో వేసుకొని తినడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక:
పైన పేర్కొనబడిన అంశం, కేవలం అవగాహన కోసం మాత్రమే.ఏవైనా సందేహాలుంటే నిపుణుల సహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం.