పొట్టను సూప‌ర్ ఫాస్ట్‌గా త‌గ్గించే కూరగాయలు ఇవే!

పొట్ట చుట్టు కొవ్వు లేదా బెల్లీ ఫ్యాట్.చాలా మంది కామ‌న్‌గా ఫేస్ చేసే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

శ‌రీరంలో ఉండాల్సిన కేల‌రీల కంటే ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోయి లావుగా మార‌తారు.ఫ‌లితంగా బ‌ట్ట‌లు ప‌ట్ట‌క‌పోవ‌డ‌మే కాదు.

చూసేందుకు కూడా అంద‌హీనంగా క‌నిపిస్తారు.ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, స్మోకింగ్‌, ఆల్కహాల్, వ్యాయామం లేక‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పొట్ట చుట్టు కొవ్వు ఏర్ప‌డుతుంది.

ఇక పొట్ట చుట్టు కొవ్వుపెరిగిపోయాక‌.దాన్ని త‌గ్గించుకునేందుకు ప‌డే పాట్లు అన్నీ ఇన్నీ కావు.

Advertisement

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే కూర‌గాయ‌ల‌‌ను డైట్‌లో చేర్చుకుంటే గ‌నుక సూప‌ర్ ఫాస్ట్‌గా బెల్లీ ఫ్యాట్‌ను క‌రిగించుకోవ‌చ్చు.మ‌రి ఆ కూర‌గాయ‌లు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

పొట్ట చుట్టు కొవ్వును క‌రిగించ‌డంలో గుమ్మడి కాయ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.గుమ్మ‌డి కాయ‌లో మన శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన పోషకాలతో పాటు.

ఫైబ‌ర్ ఎక్కువ‌గా, కేల‌రీలు త‌క్క‌వ‌గా ఉంటాయి.అందువ‌ల్ల‌, త‌ర‌చూ గుమ్మ‌డి కాయ‌ను ఏదో ఒక రూపంలో తీసుకుంటే పొట్ట చుట్టు కొవ్వు క‌రుగుతుంది.

అలాగే సొర‌కాయ కూడా పొట్ట చుట్టు కొవ్వును క‌రిగించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.త‌ర‌చూ సొర‌కాయ‌ను జ్యూస్‌లా లేదా కూర రూపంలో తీసుకుంటే.శ‌రీరంలో అద‌నంగా పేరుకుపోయిన కేల‌రీలు క‌రిగిపోతాయి.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఫ‌లితంగా బెల్లీ ఫ్యాట్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.పాల‌కూరను రెండు రోజుల‌కు ఒక‌సారి తీసుకుంటే.

Advertisement

అందులో ఉండే ప‌లు పోష‌కాలు శ‌రీరంలో కొవ్వును క‌రిగించి ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి.అందువ‌ల్ల‌, పొట్ట చుట్టు కొవ్వును క‌రిగించుకోవాలి అని భావించే వారు ఖ‌చ్చితంగా పాల‌కూర‌ను డైట్‌లో చేర్చుకోవాలి.

కాలిఫ్లవర్ కూడా బెల్లీ ఫ్యాట్‌ను త్వ‌ర‌గా క‌రిగించ‌గ‌ల‌దు.ఎందుకంటే, కాలిఫ్ల‌వ‌ర్‌లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది.

ఫైబ‌ర్ ఉండే ఏ ఆహారం తీసుకున్నా శ‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది.అందువ‌ల్ల‌, పొట్ట త‌గ్గాల‌నుకునే వారు కాలిఫ్ల‌వ‌ర్‌ను కూడా త‌ర‌చూ తీసుకోవాలి.

ఇక కాలీఫ్ల‌వ‌ర్‌తో పాటు క్యాబేజీ, బ్రకోలి, క్యాప్సిక‌మ్‌, క్యారెట్ వంటివి కూడా తీసుకుంటే.ఫాస్ట్‌గా పొట్ట త‌గ్గించుకోవ‌చ్చు.

తాజా వార్తలు