శివరాత్రి రోజు శివయ్యకు ఈ పుష్పాలతో పూజ చేస్తే చాలు... జన్మ జన్మల పాపాలు తొలిగిపోతాయి!

పురాణాల ప్రకారం శివుడు లింగ రూపంలోకి ఉద్భవించిన రోజున మహా శివరాత్రి పండుగ జరుపు కుంటున్నాము.ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చి 1వ తేదీ మహా శివరాత్రి పండుగ రావడంతో ఇప్పటికే పలు శివాలయాలు శివరాత్రి వేడుకలకు ముస్తాబయ్యాయి.

 Do This Shiva Pooja At Shivarathri Festival Know Full Details Inside Shivarathri-TeluguStop.com

శివరాత్రి పండుగ రోజు ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో ఉపవాసంతో స్వామి వారికి పూజ చేసి స్వామివారి అనుగ్రహం పొందుతారు.ఈ విధంగా స్వామివారి అనుగ్రహం మనపై ఉండటం వల్ల సకల పాపాలు తొలగిపోయి అనుకున్న కోరికలు నెరవేరుతాయని భావిస్తారు.

అయితే మహా శివరాత్రి రోజు స్వామివారి అనుగ్రహం మనపై ఉండాలంటే తప్పనిసరిగా స్వామి వారికి కొన్ని రకాల పుష్పాలతో పూజ చేయటం వల్ల ఆయన అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.మరి శివరాత్రి రోజు పరమేశ్వరుడిని ఏ పుష్పాలతో పూజ చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయి అనే విషయానికి వస్తే.

పారిజాత పుష్పాలతో ఆ భోళా శంకరుడికి పూజ చేయటం వల్ల ఎంతో ఆరోగ్యకరం.ఇక స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన మారేడు దళాలతో స్వామివారికి పూజ చేయడంవల్ల పరమేశ్వరుడు ప్రీతి చెంది అనుకున్న కోరికలు నెరవేరుస్తాడని చెప్పవచ్చు.

శంకు పుష్పాన్ని దేవతల పుష్పంగా భావించారు.ఈ క్రమంలోనే ఈ శంకు పుష్పాలతో పూజ చేయటం వల్ల ఆ శివుడి అనుగ్రహం మనపై ఉంటుందని ఎంత ఖరీదైన ఈ పుష్పాలను కొనుగోలు చేసి స్వామివారికి పూజ చేస్తారు.

జిల్లేడు పుష్పాలతో స్వామికి పూజ చేయటం వల్ల స్వామి అనుగ్రహం మనపై కలిగే సకల సంపదలు కలిగిస్తాడు.అలాగే గత జన్మల పాపాలు కూడా తొలగి పోతాయి.గన్నేరు పువ్వులతో స్వామి వారికి పూజ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి.ఇక స్వచ్ఛతకు ప్రశాంతతకు మారు పేరు అయిన మల్లె పువ్వులతో స్వామి వారికి అభిషేకం చేయటం వల్ల సంతోషం మానసిక ప్రశాంతత కలుగుతుంది.

కనుక మహా శివరాత్రి రోజు స్వామివారి పూజకు ఈ పుష్పాలు తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలి.

Do This Shiva Pooja At Shivarathri Festival Know Full Details Inside Shivarathri

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube