మూలమూర్తి లేక ధ్రువమూర్తి :
స్వామివారు స్వయంభువు.స్వామి వారు తన దివ్య లోకము నుండి దిగివచ్చి స్వయంగా వెలసిన మూర్తి.
అయితే మూల మూర్తి నిమిది అడుగుల ఎత్తు కలిగి చతుర్భుజుడై వెలిశాడు.స్వామివారి దక్షిణ వక్ష స్థలమున శ్రీదేవి కొలువై ఉంది.
స్వామివారి చతుర్భుజములలో, రెండు ఊర్థ్వ బాహువులందు శంఖ చక్రములు ఉంటాయి.అధో హస్తములలో దక్షిణ హస్తము కటి అవలంబిత భంగిమలోను వుంటాయి.
భక్తులు అడిగిన కోరికలను యథేచ్చగా ఇచ్చే వరదహస్తుడు స్వామి వామహస్తమునందలి బొటన వ్రేలు తుంటి భాగమునకు, ఊరువుకు తగిలి వుంటుంది.వక్షస్థల మధ్యన కౌస్తుభము ఒకటి వ్రేలాడుతూ వుంటుంది.
స్వామి వారికి ఒక నాగాభరణము కూడావుంది.ఈ నాగాభరణము విగ్రహత మైనదికాదనీ, భక్తులెవరో సమర్పించిన కానుక అని భావిస్తారు.
భోగ శ్రీనివాసమూర్తి (కౌతుకబేరము):
ఈ మూర్తిని కౌతుక బేరము అని అంటారు.పదవ శతాబ్దంలో స్వామివారి ఆలయంలో ప్రతిష్ఠింపబడిన రజత విగ్రహము.
ఈ మూర్తి కూడా ధ్రువ మూర్తి వలె చతుర్భుజ మూర్తి.ఈ మూర్తి పాదము క్రింద షట్కోణ యంత్రము ఒకటి వుంది.
స్వామివారి నిత్యాభిషేకం, అర్చనలు కొరకు ఈ చర బింబమును ప్రతిష్ఠించటం జరిగింది.ఈ భోగ శ్రీనివాస మూర్తిని ఒక సిల్కుదారముతో ధ్రువమూర్తికి అనుసంధానంచేసి వుంచు తారు.
భోగశ్రీనివాసమూర్తి అన్నివిధములా ధ్రువమూర్తికి వుచ కూడా జరుగుతుంది.
కొలువు శ్రీనివాసమూర్తి
(బలిబేరము) : ఆలయంలో ప్రతినిత్యం తోమాలసేవ తరువాత తిరుమామణి మంట పంలో కొలువు జరుగుతుంది.ఇక్కడ కొలువ శ్రీనివాసుని ఒక వెండి పీఠంపైన వేంచేపు చేసి బంగారు కాలువ శ్రీనివా గొడుగును అమరుస్తారు.ఇక్కడనే పంచాంగ శ్రవణం జరుగుతుంది.
ముందురోజు హుండీద్వారా వచ్చిన ఆదాయ వివరాలను పలువురి సమ క్షంలో చదువుతారు.నాణెములు, బంగారు నగలు, విలువగల రత్నముల వివరములను ఇక్కడ స్పష్టంగా ప్రకటిస్తారు.
ఈ మూర్తి శ్రీవారి ఆలయంలోకి ఏ విధంగా ప్రవేశించాడో చెప్పలేము.ఈయనను దర్బారు శ్రీని వాసమూర్తి అనికూడా వ్యవహరిస్తారు.
ఉగ్ర శ్రీనివాసమూర్తి :
భోగ శ్రీనివాసమూర్తి ఆలయ ప్రవేశముందు నాటి నుంచే ఉగ్రశ్రీనివాసమూర్తి ఆలయంలోవున్నట్లు తెలుస్తుంది.ఆరం భంలో ఉగ్రశ్రీనివాసమూర్తియే ఉత్సవమూర్తిగా వ్యవహరించారు.ఈస్వామి వారి చేతిలోని చక్రము ప్రయోగించుటకు సిద్ధంగా వుంటుంది.ప్రస్తుతం ఈమూర్తి స్వామివారి చేతిలోని చక్రము ప్రయోగించుటకు సిద్ధంగా వుం టుంది.ప్రస్తుతం ఈ మూర్తి స్వామివారి మూడు ఉత్సవాలలో మాత్రమే పాల్గొనటం జరుగుతూ వుంది.అవి ముక్కోటి ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ద్వాదశారాధనం.
ఉత్సవమూర్తి (శ్రీభూదేవి సమేత మలయప్పస్వామి) :
మలయప్ప స్వామి వారి రాకకు పూర్వం ఉగ్ర శ్రీనివాసమూర్తి ఉత్సవాలలో పాల్గొనేవారు.ఒకసారి బ్రహ్మోత్సవ సమయంలో గ్రామంలో మహాగ్నిజ్వాల రగిలి గ్రామ మంతా ఆహుతి అయింది.విధినిర్వహణలో దోషం ఏమైనా జరిగిందేమోనని అర్చకస్వాములు భయపడి క్షమింపమని స్వామివారిని కోరారు.ఆ సమ యంలో ఒకరికి పూనికవచ్చి ఇక తననెప్పుడు ఉత్సవములలో ఉపయోగింప రాదని ఆ పర్వతమైదానంలో ఒకమూర్తి కలదనీ, ఆ మూర్తిని ఉత్సవములలో ఉపయోగింపవలసినదనీ స్వామివారు ఆనతిచ్చారు.
స్వామివారి ఆనతి ప్రకారంవెదకగా, దేవేరులతోకల స్వామివారిమూర్తి లభించింది.మలై అంటే పర్వతం.పర్వతమునందు లభించిన స్వామి అనే పేరువచ్చింది.1399వ సంవత్సర ప్రాంతంలో ఈసంఘటన జరిగివుంటుందని భావిస్తున్నారు.
ఇతరమహర్షులు :
స్వామివారి అయిదు మూర్తులుగాక, సన్నిధిలో సుదర్శన చక్రంవుంది.ఈస్వామిని చక్రత్తాళ్వారు అనిఅంటారు.
బ్రహ్మోత్స వాల సమయంలో అంకురార్పణ లో చక్రత్తాళ్వారు స్వామిని వస్తారు.బ్రహ్మోత్సవాల ముగింపులో పుష్కరిణీకి వేంచేపు చేస్తారు.
APP TOP NEWS SLIDESHOW