ప్రస్తుతం న్యాయ దేవుడు ఆయన శని( Saturn ) తన సొంత రాశి కుంభ రాశిలో ( Aquarius )సంచరిస్తూ ఉన్నాడు.కానీ తన కదలికలు మార్చుకుంటూ అన్ని రాశుల మీద చూపిస్తున్నాడు.
ఇప్పుడు శని నక్షత్రం మారబోతున్నాడని నిపుణులు చెబుతున్నారు.శని ప్రస్తుతం శతాభిషా నక్షత్రంలో ఉన్నాడు.ఏప్రిల్ ఆరవ తేదీన శని పూర్వా భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.30 సంవత్సరాల తర్వాత శని ఈ నక్షత్రంలో సంచరించబోతున్నాడు.దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి కష్టాలు తప్పవని జ్యోతిష్య నిపుణులు( Astrologers ) చెబుతున్నారు.ఈ సమయంలో ఓపికగా ఉండాలి అని అలాగే ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోవాలనీ నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే శని నక్షత్రం( Shani Nakshatra ) మార్పు వల్ల మేష రాశి వారికి కష్టాలు తప్పవు.ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారు.జీవిత భాగస్వామితో వివాదాలు మనసునీ ప్రశాంతంగా లేకుండా చేస్తాయి.కడుపు నొప్పి, చర్మ సమస్యలు, తల నొప్పి ( Stomach ache, skin problems, headache )లాంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు.అలాగే మీన రాశి వారికి శని నక్షత్ర మార్పు కలిసి రాలేదు.
అ శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది.మానసికంగా ఒత్తిడికి గురవుతారు.
గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మరింత తగ్గుతుంది.ఆస్తికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి.
ఈ సమయంలో వ్యాపారంలో పెట్టబడిన పెట్టకుండా ఉండడమే మంచిది.

లేదంటే భారీ నష్టం జరుగుతుంది.అలాగే బంధువులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది.ఇంకా చెప్పాలంటే శని నక్షత్ర సంచారం సింహ రాశి వారికి ఆర్థిక సమస్యలను పెంచుతుంది.
అమితమైన ఖర్చులతో జేబులు ఖాళీ అవుతాయి.అలాగే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
అలాగే తుల రాశి వారికి కూడా ఆర్థిక కష్టాలు రాబోతున్నాయి.అప్పుల బాధతో సతమతమవుతారు.
ఆరోగ్య సమస్యలు తిరగబడే అవకాశం ఉంది.