తిరుచానూరు పద్మావతి అమ్మవారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు.సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుచానూరు శ్రీ పద్మావతి దేవాలయం లో వరద సప్తమి వేడుకలు ఎంతో ఘనంగా, వైభవంగా జరిగాయి.
ఒకే రోజు ఏడు వాహనాలపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.బ్రహ్మోత్సవాలను తల్పించే విధంగా నిర్వహించిన ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని సంతోషంగా దర్శించుకున్నారు.
ఉదయం సూర్యుడి రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మ వారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకున్నారు.ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ వాహనంతో మొదలై మధ్యాహ్న 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ,గరుడా, చిన్న శేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
తిరిగి సాయంత్రం మూడు గంటల 30 నిమిషాల నుంచి 4:30 వరకు స్నపన తిరుమంజనం వేడుక జరిగింది.సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం రాత్రి 8 గంటల 30 నిమిషాల్లో నుంచి 9:30 వరకు గజ వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయనికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఉదయం 6 గంటలకు స్వామీ వారి అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భజన బృందాలు కూడా పాల్గొన్నాయి.కోలాటాలు, చెక్కభజనలు, చిడతల భజన తదితర కార్యక్రమాలు జరిగాయి.
ఇంకా చెప్పాలంటే తిరుమల ఎస్వీబీసీ ట్రస్ట్ కు మన దేశ రాజధాని కి చెందిన రమా సివిల్ ఇండియా కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 10 లక్షల విరాళం ఇచ్చారు.ఈ సంస్థ తరఫున ప్రతినిధి వై.రాఘవేంద్ర ఈ విరాళాన్ని అందజేశారు.విరాళం తిరుమల బోర్డు కార్యాలయంలో ఈవో.ధర్మారెడ్డికి అందజేశారు.గతంలో కూడా ఈ సంస్థ తిరుమల దేవాలయానికి 20 లక్షల విరాళాన్ని ప్రకటించింది.
TELUGU BHAKTHI