మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శుక్రవారానికి ఎంతో ప్రత్యేకత ఉంది.శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజుగా భావించి మహా లక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
కనకదుర్గ అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేయటం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.ఈ విధంగా మన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే మన ఇంట్లో కొన్ని పద్ధతులను పాటించాలని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.
అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం రోజున పంచామృతాలతో అభిషేకించి .గులాబీలతో అర్చించి, ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై కలిగే ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోయి సంపదలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు.ఈ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే అమ్మ వారికి నచ్చిన విధంగా మనం నడుచుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది.

పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యం,పాలు, పూలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నివాస స్థానాలు.అందువల్ల ఈ విషయాలలో ఎప్పుడూ నిర్లక్ష్యం వహించకూడదని పండితులు తెలియజేస్తున్నారు.అదే విధంగా మన ఇంట్లో ఎప్పుడూ కలహాలు, పోట్లాటలు ఉంటే, ఉదయం పొద్దు పొడిచిన నిద్రపోయేవారు, సంధ్యాసమయంలో పడుకునే వారి ఇంట్లో, సోమరితనం వల్ల ఇంట్లో సమయాన్ని వృధా చేసే వారి ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉండదు.
తరుచూ పెద్దల పట్ల గౌరవం, తల్లి ,తండ్రి గురువులను పూజించే వారి ఇంట్లో లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది.అంతే విధంగా మనకు ఉన్న దానిలో, మన స్తోమతకు తగ్గట్టుగా ధాన ధర్మాలు చేయడం వల్ల అమ్మవారు ఎంతో సంతోషించి ఆమె అనుగ్రహం మనపై ఉంటుందని వేదపండితులు తెలియజేస్తున్నారు.