ఈ భూమి పై జన్మించిన ప్రతి ఒక్క మనిషి తమ విధిని అనుసరించి జీవితాన్ని గడపాలని పండితులు చెబుతున్నారు.అలాగే పుట్టినా నక్షత్రం జాతకం పై ప్రభావం చూపించే గ్రహాలను బట్టి కొన్ని యోగాలు ఏర్పడుతూ ఉంటాయి.
గ్రహాలు ఒక నక్షత్రంలో నుంచి మరొక నక్షత్రంలోనికి ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి ప్రవేశించేటప్పుడు కొన్ని యోగాలు ఏర్పడతాయి.మన జాతకంలో ఏర్పడే కొన్ని యోగాలు శుభ యోగాలు అయితే మరి కొన్ని అశుభ యోగాలుగా ఉంటాయి.
కొన్ని యోగాల వల్ల జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.అలాంటి యోగాలలో ఒకటి కాలసర్ప యోగం అని నిపుణులు చెబుతున్నారు.

ఒక వ్యక్తి జాతకంలో కాలసర్ప దోషం( kalasarpa dosha ) ఉన్నట్లయితే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే కాలసర్ప యోగం మాత్రం పేదవాళ్లను ధనికులుగా మారుస్తుంది.మన జాతకంలోని జీవితం మీద ప్రభావం చూపించే వాటిలో రాహువు కేతు చాలా ముఖ్యమైనవి.అలాగే వీటిని నీడ గ్రహాలుగా భావిస్తారు.ఇవి అశుభ ఫలితాలను ఇస్తాయని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు.జ్యోతిష్య శాస్త్రంలో రాహువును ఉత్తర ధ్రువమని, కేతువును దక్షిణ ద్రవం అని పిలుస్తారు.
ఇంకా చెప్పాలంటే రాహువు మరియు కేతువు ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎల్లప్పుడూ అన్ని విషయాలలోనూ వెనుకబడి ఉంటాడు.ఆ వ్యక్తి జాతకంలోని అన్ని ఇతర గ్రహాలు కూడా రాహు కేతువు( Rahu Ketu )లతో ప్రభావితమై ఉంటాయి.

అప్పుడు ఆ వ్యక్తి కాలసర్ప దోషాన్ని అనుభవించవలసి వస్తుంది.కాలసర్ప యోగం 12 రకాలుగా ఉంటుంది.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం ఈ దోషం మరియు యోగం ప్రపంచంలో ప్రతిభావంతులైన వారి జన్మ చాట్ లో తప్పని సరిగా ఉంటుంది.వ్యక్తి యొక్క జాతకంలో రాహు, కేతువులు శుభ స్థానంలో ఉంటే ఎన్ని ఇబ్బందులు ఉన్న ఆ వ్యక్తి చాలా ధనాన్ని సంపాదిస్తాడు.
కాలసర్ప శుభ యోగం తో రాత్రికి రాత్రి పేదవాళ్లు ధనవంతులుగా మారిపోతారు.
LATEST NEWS - TELUGU







