తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటలలో సత్యం రాజేష్( Satyam Rajesh ) ఒకరు.ఈయన రీసెంట్ గా పొలిమేర 2( Polimera 2 ) అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఇక నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయ్యే దిశగా ముందుకు దూసుకెళుతుంది.ఇక ఇప్పుడు ఈ సినిమాని చూడ్డానికి ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే చేతబడులు ప్రధానంగా సాగిన ఈ సినిమా ఆధ్యాంతం ఆసక్తిని రేకెత్తిస్తు ప్రేక్షకుడి కి ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా చాలా బాగున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా చివర్లో పొలిమేర 3 సినిమా( Polimera 3 ) కూడా ఉంటుందని డైరెక్టర్ తెలియజేయడం జరిగింది.
అయితే పొలిమేర 3 సినిమా కోసం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో తీయడం లో మంచి పేరు తెచ్చుకున్న అడవి శేషు( Adivi Sesh ) రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాని డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్( Director Anil Viswanath ) అడవి శేషు పెట్టి తెరకెక్కించాలనే ఇంటెన్స్ తో డైరెక్టర్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం పొలిమేర సినిమా డైరెక్టర్ వేరే హీరోతో నార్మల్ సినిమా ఒకటి చేసి దాని తర్వాత పొలిమేర 3 మూవీ ని తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే పొలిమేర 3 సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తయినప్పటికీ వరుసగా ఇలాంటి చేతబడుల సినిమాలు చేస్తే

ప్రేక్షకుల నుంచి ఆయనకి చేతబడి డైరెక్టర్ అనే ఒక ముద్ర పడుతుందనే ఉద్దేశ్యం తోనే తను ఈ ప్రాజెక్టు ని కొద్ది వరకు పక్కన పెట్టి మధ్యలో ఒక సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పైన కూర్చొని ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక అడివి శేషు ఈ సినిమాలోకి వస్తె బాగానే ఉంటుంది కానీ సత్యం రాజేష్ ను చూసిన జనాలు అడివి శేషు ను చూస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది….