సాధారణంగా మన దేశంలో ఏ శివాలయానికి వెళ్ళిన మనకు శివలింగానికి ఎదురుగా నంది దర్శనమిస్తుంది.శివాలయానికి వెళ్ళిన వారు నంది కొమ్ముల మధ్య నుంచి ఆ శివుని దర్శించుకోవడం మనం చూస్తూనే ఉంటాం.
కానీ శివలింగానికి ఎదురుగా నంది లేకుండా ఉన్న శివాలయం ఒకటి ఉందని మీకు తెలుసా? ఆ విధంగా నంది లేకుండా ఉన్న శివ లింగం కాశీ విశ్వేశ్వర ఆలయం అని చెప్పవచ్చు.దేశంలో ఉన్న శివాలయాలలో అన్నింటికీ భిన్నంగా ఇక్కడ ఉన్న శివాలయంలో శివునికి ఎదురుగా నందిని ప్రతిష్టించ లేదు.
ఆ విధంగా శివ లింగం ముందు నంది ప్రతిష్టించకపోవడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం భారతదేశం పై దండెత్తిన ఔరంగజేబు హిందూ దేవాలయాలు అన్నింటిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఆ విధంగా మన దేశంలో ప్రముఖ దేవాలయాల అన్నింటిని ధ్వంసం చేస్తూ చివరగా కాశీ విశ్వేశ్వర ఆలయం పై తన సైన్యంతో దండెత్తి వచ్చారు.ఈ విషయాన్ని గ్రహించిన ఆలయ ప్రధాన అర్చకుడు శివాలయంలో ఉన్న శివలింగాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న కోనేటిలో పడేసారు.
ఔరంగజేబు అతని సైన్యం దేవాలయంలో సగం శిథిలాలన్నింటిని కూల్చివేశారు.కానీ ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుని కూల్చకుండా అలాగే వదిలి వెళ్లారు.
ఔరంగజేబు అతని సైన్యం వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకు కోనేరులో పడేసిన శివలింగాన్ని కోసం ఎంతో ప్రయత్నించారు.అయితే ఆ శివలింగం కోనేరులో కనిపించకపోవడంతో అదే రూపంలో ఉన్న మరో శివలింగాన్ని తయారు చేయించి కొత్తగా నిర్మించిన దేవాలయంలో ప్రతిష్టించారు.అయితే ఈ దేవాలయంలో శివలింగాన్ని దర్శించుకున్న భక్తులు దేవాలయానికి వెళ్లి నందీశ్వరుని దర్శించుకుంటారు.అంతేకాకుండా కోనేరులో శివలింగం ఉందని భావించే భక్తులు పొద్దు పొద్దున ఆ కోనేరుకు పూజలు నిర్వహిస్తుంటారు.
అంతేకాకుండా ఆ కోనేటిలో ఉన్న నీటిని మహా తీర్థ ప్రసాదంగా భావిస్తారు.దేశంలో ఉన్న శివాలయాలలో శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో మాత్రమే శివలింగం ఎదురుగా నంది ఉండదు.
LATEST NEWS - TELUGU