తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణ మురళి. ఈయన తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
తన కామెడీతో మాత్రం తెగ నవ్విస్తాడు పోసాని.ఎన్నో సినిమాలలో సహాయ పాత్రలలో నటించాడు.
బుల్లితెరపై కూడా పలు షోలలో, సీరియల్స్ లలో నటించాడు.ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో మెప్పిస్తున్నాడు.
ఇక కృష్ణ మురళికి కొన్ని అలవాట్లు ఉన్నాయి.ముఖ్యంగా తాను అందరితో లవ్ యు రాజా అంటూ పలుకరించి రాజా అని మాట్లాడుతూ ఉంటాడు.సినిమాలలోనే కాకుండా బయట కూడా అలాగే కనిపిస్తాడు పోసాని.ఇక ముఖ్యంగా తన షర్ట్ ను పదే పదే లాక్కుంటూ కాస్త విచిత్రంగా చేస్తుంటాడు.
దీంతో ఈయనకు అలవాటు ఉండటంతో చాలామంది పోసాని కి ఇదేమైనా జబ్బా.నరాల వీక్ నెస్ ఏమైనా ఉందా అని తెగ ప్రశ్నలు వేశారు.
దీంతో ఈ విషయం గురించి గతంలో స్పందించాడు పోసాని. తనకు ఈ అలవాటు ఎందుకు వచ్చిందో తెలియదు అంటూ, ఎందుకు పోవడం లేదో కూడా తెలియదు అని అన్నాడు.
తన షర్టును ఇలాగే లాగుతుంటా అని తనకు తెలియకుండానే చెయ్యి అక్కడికి పోతుందని తెలిపాడు.తన భార్య కూడా అలా చాలా సార్లు చెప్పినా కూడా తనకు ఈ అలవాటు పోవడం లేదు అని.ఈ మధ్యకాలంలో అలా చేయడం తగ్గినట్లుగా అనిపించింది అని తెలిపాడు.
ఇక సినిమాలలో కూడా షర్టు ను అలా అనేస్తుంటా అంటూ.ఇక అలా చూసిన తన భార్య తనకు ఏదైనా జబ్బు ఉందేమో అని అందరూ అనుకుంటున్నారు అని తెలిపింది.ఇదేం నరాల వీక్ నెస్ కాదు అంటూ.
కేవలం ఒక అలవాటు అని.అది ఒక వ్యసనంలా మారిపోయింది అని తెలిపాడు.ఇక షూటింగ్ సమయంలో కూడా చాలా మంది హీరోలు తనను వెక్కిరించారని.ఏడిపించారని. తన డ్రెస్సింగ్ స్టైల్ చూసి కూడా సరదాగా కామెడీ చేసే వాళ్ళు అని తెలిపాడు.
కానీ తాజాగా తన చొక్కా లాగే మేనరిజం వెనుక రహస్యాన్ని బయటపెట్టాడు.తాజాగా ఆయన సాయికుమార్ హోస్ట్ గా నిర్వహిస్తున్న వావ్ అనే గేమ్ షో లో పాల్గొన్నాడు.దానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో కూడా పోసాని తన షర్టు ను పైకి లాగుతూ కనిపించాడు.
వెంటనే సాయి కుమార్ ఆ చొక్కా లాగుడు ఎందుకు అని సరదాగా అడిగాడు.
దీంతో వెంటనే పోసాని నవ్వుతూ.
నరాల వీక్నెస్ అన్నా.అందుకే అలా అంటూ ఉంటాను.
చిన్నప్పటి నుంచి అంతే అలవాటు అయిపోయింది.నా భార్య చేతుల మీద చాలా సార్లు కొట్టింది.
అయినా కూడా ఆ అలవాటు మారడం లేదు అని అన్నాడు.ఇక మొత్తానికి పోసాని కి నరాల వీక్నెస్ ఉందని క్లారిటీ వచ్చింది.