తెలుగు సినిమా పరిశ్రమలో ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి కష్టపడి ఒక పెద్ద స్టార్ హీరోగా మొదటగా ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ అని చెప్పాలి.తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకొని తనకు పోటీ ఎవరు లేరు అని నిరూపించిన వ్యక్తి నందమూరి తారకరామారావు గారు.
ఎన్నో సినిమాల్లో ఎవరికీ సాధ్యం కాని పాత్రలు వేసి జనాలను మెప్పించారు.అలాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం అని చెప్పాలి.
తెలుగులో పాతాళ భైరవి, దాన వీర శూర కర్ణ, లవకుశ,మిస్సమ్మ, గుండమ్మ కథ లాంటి చాలా సినిమాల్లో ఆయన నటనను మనం చూడొచ్చు.ఆయన ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీలో కి చాలామంది వచ్చారు.
ఎన్టీఆర్ కొన్ని దశాబ్దాల పాటు నెంబర్ వన్ హీరోగా కొనసాగారు అలాంటి నటుడు ఇక ముందు రాడు అనే చెప్పాలి.అయితే ఎన్టీఆర్ రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు సినిమాలో తనదైన నటనతో జనాలని మేప్పించారు కమర్షియల్ సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేశారు.
సినిమాల నుండి రాజకీయాలవైపు వెళ్లి తెలుగుదేశం పార్టీ పెట్టారు.పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సీఎం అయ్యారు.జనాలకి రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి పేద ప్రజలను ఆదుకున్నారు.అప్పటివరకు తెలుగు వాళ్ళని చులకనగా చూసే ఉత్తర భారతదేశం ప్రజలంతా ఎన్టీఆర్ అధికారంలోకి రావడంతో తెలుగు వాళ్ళ గొప్పతనం గురించి తెలుసుకున్నారు తెలుగు వాళ్ల గొప్పతనాన్ని ఇండియాలోనే కాదు ప్రపంచమంతా చాటిచెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్.
అలాంటి ఎన్టీఆర్ కి భక్తి భావం ఎక్కువగా ఉంటుంది తెలుగు భాష మీద మంచి గ్రూప్ ఉంది అందుకే వాళ్ల కొడుకులకి కానీ,కూతుళ్ళకి కానీ మనవాళ్లకు గాని, మనవరాళ్ల గాని మంచి మంచి పేర్లని సెలెక్ట్ చేసి పెట్టాడు.ఎన్టీఆర్ గారికి ఏడుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు.
కొడుకు లందరికీ చివర్లో కృష్ణ అని కలిసేట్టుగా పేర్లు పెట్టారు వాళ్ల పేర్లు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.జయ కృష్ణ, హరి కృష్ణ, రామకృష్ణ, మోహన కృష్ణ బాలకృష్ణ, జయశంకర్ కృష్ణ, సాయి కృష్ణ.
వీళ్లలో మనకి హరికృష్ణ బాలకృష్ణ మాత్రమే ఎక్కువగా తెలుసు ఎందుకంటే ఎన్టీఆర్ తర్వాత హరికృష్ణ హీరోగా వచ్చి కొన్ని సినిమాలు చేసి తర్వాత పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చాడు.బాలకృష్ణ మాత్రం మంచి మాస్ హీరోగా గుర్తింపు పొందారు.
సమరసింహారెడ్డి నరసింహనాయుడు సింహ లెజెండ్ రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాలతో మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించారు.అయితే వీళ్ళ పేర్లు ఇలా ఉంటే కూతురు పేర్లను కూడా చాలా గమ్మత్తుగా పెట్టారు చివర్లో ఈశ్వరి కలిసేట్టుగా గా పెట్టారు.
పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, ఉమా మహేశ్వరి.
అలాగే వాళ్ల పిల్లలకు కూడా ఇలాంటి పేర్లు పెట్టాడు ముఖ్యంగా ఎన్టీఆర్ మనవరాళ్లకు మంచి పేరు పెట్టారు వాళ్ల పేర్లు ఏంటో చూద్దాం…జయ కృష్ణ కి ఒక కూతురు ఉంది ఆమె పేరు కుముదిని అలాగే హరికృష్ణకు ఒక కూతురు ఉంది ఆమె పేరు మొదట్లో వెంకట రామమ్మ అని పెట్టినప్పటికీతర్వాత ఆమె పేరు సుహాసిని అని పెట్టారు, బాలకృష్ణ కి ఇద్దరు కుమార్తెలు పెద్ద అమ్మాయి పేరు బ్రాహ్మణి, చిన్న అమ్మాయి పేరు తేజస్విని అలాగే సాయి కృష్ణ కూతురు పేరు ఈషాని ఇలాంటి పేర్లను పెట్టి తెలుగు పైన తనకు ఎంత మమకారం ఉందో రుజువు చేశారు ఎన్టీఆర్ గారు.ఎన్టీఆర్ కి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అందుకే వాళ్ల పేర్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని పద్ధతిగా పెట్టాడు.చివరి స్టేజ్ లో తన పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతి కూడా తెలుగు పైన మంచి గ్రీప్ ఉందనే ఉద్దేశంతోనే ఆమెని పెళ్లి చేసుకున్నారని వార్తలు అప్పట్లో చాలా వచ్చాయి.