కాకినాడ సి పోర్ట్ ,( Kakinada Sea Port ) సెజ్ ను బలవంతంగా లాక్కున్నారన్న కేసులో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి తో( Vijayasai Reddy ) పాటు, మరికొంతమందికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.కె.
వి.రావు ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సిఐడి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో ఆ ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేశారు.దీనిపై ఇప్పటికే ప్రాథమిక విచారణ నిర్వహించిన ఈ డి అధికారులు భారీగా మనీ ల్యాండరింగ్( Money Laundering ) జరిగినట్లుగా భావిస్తున్నారు.
దీనిపై మరింత లోతుగా విచారించేందుకు నోటీసులు జారీ చేశారు.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ కేసులో నిందితులైన వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి,( Vikranth Reddy ) విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి( Sarath Chandra Reddy ) లకు సైతం నోటీసులు జారీ చేశారు.వీరంతా విచారణకు రావాల్సిందిగా ఈడి అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.అయితే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో , తాను ఈ విచారణకు హాజరు కాలేనని విజయసాయిరెడ్డి ఈడి అధికారులకు తెలిపారు.
ఇక ఇదే కేసులో ఉన్న సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నందున తాను విచారణకు హాజరుకాలేనని ఈడి అధికారులకు సమాచారం అందించారు.
ఈ నేపథ్యంలోనే మరోసారి వీరందరికీ ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి కాకినాడ రిపోర్ట్ వ్యవహరంలో జరుగుతున్న అవకతవకులను నిగ్గు తేల్చాలని ఈడి అధికారులు భావిస్తున్నారు.ముఖ్యంగా ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉండడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, గత వైసిపి ప్రభుత్వం లో కాకినాడ సి పోర్ట్ కేంద్రంగా జరిగిన భారీ అవినీతి వ్యవహారాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఆలోచనతో ఉండడంతో ఈ వ్యవహారం అందరికీ ఆసక్తికరంగా మారింది.