కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

కాకినాడ సి పోర్ట్ ,( Kakinada Sea Port ) సెజ్ ను బలవంతంగా లాక్కున్నారన్న కేసులో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి తో( Vijayasai Reddy ) పాటు,  మరికొంతమందికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

కె.వి.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

రావు ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సిఐడి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో ఆ ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేశారు.

దీనిపై ఇప్పటికే ప్రాథమిక విచారణ నిర్వహించిన ఈ డి అధికారులు భారీగా మనీ ల్యాండరింగ్( Money Laundering ) జరిగినట్లుగా భావిస్తున్నారు.

దీనిపై మరింత లోతుగా విచారించేందుకు నోటీసులు జారీ చేశారు.  """/" / మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ కేసులో నిందితులైన వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి,( Vikranth Reddy )  విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి( Sarath Chandra Reddy ) లకు సైతం నోటీసులు జారీ చేశారు.

వీరంతా విచారణకు రావాల్సిందిగా ఈడి అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.అయితే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో , తాను ఈ విచారణకు హాజరు కాలేనని విజయసాయిరెడ్డి ఈడి అధికారులకు తెలిపారు.

ఇక ఇదే కేసులో ఉన్న సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నందున తాను విచారణకు హాజరుకాలేనని ఈడి అధికారులకు సమాచారం అందించారు.

  """/" / ఈ నేపథ్యంలోనే మరోసారి వీరందరికీ ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి కాకినాడ రిపోర్ట్ వ్యవహరంలో జరుగుతున్న అవకతవకులను నిగ్గు తేల్చాలని ఈడి అధికారులు భావిస్తున్నారు.

ముఖ్యంగా ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉండడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం,  గత వైసిపి ప్రభుత్వం లో కాకినాడ సి పోర్ట్ కేంద్రంగా జరిగిన భారీ అవినీతి వ్యవహారాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఆలోచనతో ఉండడంతో ఈ వ్యవహారం అందరికీ ఆసక్తికరంగా మారింది.

పద్మశ్రీ అవార్డులపై రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు…మనకు రావు అంటూ?