జుట్టు( Hair ) విపరీతంగా రాలిపోతుందా.? ఎంత ప్రయత్నించినా హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారా.? అధిక హెయిర్ ఫాల్ కారణంగా జుట్టు రోజురోజుకు పల్చగా మారుతుందా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ ఆయిల్ ను మీరు తప్పక వాడాల్సిందే.ఈ ఆయిల్ జుట్టు రాలడాన్ని చాలా వేగంగా సమర్థవంతంగా అరికడుతుంది.అదే సమయంలో ఊడిన జుట్టును కూడా మళ్లీ మొలిపిస్తుంది.మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందు పది వెల్లుల్లి రెబ్బలు( Garlic cloves ) తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో 5 నుంచి 6 ఫ్రెష్ మందారం పువ్వులు,( Hibiscus flowers ) వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె పోసుకోవాలి.
అలాగే గ్రైండ్ చేసుకున్న మందారం పువ్వులు, వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి చిన్న మంటపై ఉడికించాలి.పదినిమిషాల పాటు ఉడికించిన తర్వాత నాలుగు రెబ్బలు కరివేపాకు ( Curry leaves )వేసి మరొక ఐదు నిమిషాల పాటు హీట్ చేయాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.ఆయిల్ పూర్తిగా కూల్ అయ్యాక స్ట్రైనర్ లేదా వస్త్రం సహాయంతో ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో నింపుకోవాలి.
ఈ ఆయిల్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఆయిల్ ను అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.
ఉదయం ఆయిల్ ను అప్లై చేసుకుని సాయంత్రం తల స్నానం చేయవచ్చు.లేదా ఆయిల్ రాసుకున్న మరుసటి రోజు కూడా హెయిర్ వాష్( Hair wash ) చేసుకోవచ్చు.వారానికి రెండు సార్లు ఈ మిరాకిల్ ఆయిల్ ను వాడితే జుట్టు రాలడం చాలా వేగంగా తగ్గుముఖం పడుతుంది.అదే సమయంలో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.
జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.
అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు త్వరగా తెల్లగా మారకుండా సైతం ఉంటుంది.
.