హెయిర్ ఫాల్( Hair fall ) కారణంగా ఆడవారే కాదు ఎంతో మంది పురుషులు కూడా సతమతం అవుతున్నారు.పని ఒత్తిడి, రేడియేషన్, ధూమపానం, పోషకాల కొరత తదితర అంశాలు పురుషుల్లో జట్టు రావడానికి కారణం అవుతుంటాయి.
ఏదేమైనా పల్చటి జుట్టు పురుషుల గ్లామర్ ను దెబ్బతీస్తుంది.ఈ క్రమంలోనే జుట్టు రాలే సమస్యను అడ్డుకొని మళ్లీ హెయిర్ ను ఒత్తుగా మార్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ టానిక్ బెస్ట్ వన్ గా పని చేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము( Grate ginger ), వన్ టీ స్పూన్ టీ పొడి( Tea powder ), ఒక కప్పు ఉల్లి తొక్కలు( Onion skins ), వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఉడికించాలి.దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.గోరువెచ్చగా అయ్యాక ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మన టానిక్ అనేది రెడీ అవుతుంది.
ఒక స్ప్రే బాటిల్ లో తయారు చేసుకున్న టానిక్ ను నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకుని మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ టానిక్ ను వాడితే జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.జుట్టు రాలే సమస్య తగ్గు ముఖం పడుతుంది.హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న పురుషులకు ఈ టానిక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.పైగా ఈ టానిక్ ను వాడటం వల్ల చుండ్రు, తలలో దురద వంటి సమస్యలు దూరం అవుతాయి.
స్కాల్ప్ హెల్తీగా శుభ్రంగా మారుతుంది.మరియు జుట్టు ఎదుగుదల సైతం మెరుగు పడుతుంది.