టాలీవుడ్ లో మేటి నటుడు చిరంజీవి కాగా.దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణ రావు.అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడిగా దాసరి ప్రపంచ రికార్టు సాధిస్తే.150 చిత్రాల్లో నటించి అందరి చేత ప్రశంసలు పొందాడు మెగాస్టార్ చిరంజీవి.అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేయడంతో పాటు అగ్రహీరోలు అందంరూ దాసరి సినిమాల్లో చేశారు.అటు నటనలో మెళకువలు పొందిన చిరంజీవి అగ్ర దర్శకులు అందరితో సినిమాలు చేశాడు.
అయితే దర్శకుడు దాసరి.మెగాస్టార్ చిరంజీవి కాంబినేషనన్ లో ఒకే ఒక్క సినిమా రావడం విశేషం.
అది దాసరికి 100వ సినిమా కావడం మరో విశేషం.ఆ సినిమా మరేదో కాదు లంకేశ్వరుడు.చిరంజీవి సినిమాల్లోకి వచ్చి 11 ఏండ్ల తర్వాత దాసరి దర్శకత్వంలో ఈ సినిమా చేశారు.1989 అక్టోబర్ 27న ఈ మూవీ విడుదలైంది.ఈ సినిమాకి ముందు దాసరి-చిరంజీవి కాంబినేషన్ మూవీ ఎప్పుడు వస్తుందో అని ఇండస్ట్రీలో టాక్ వినిపించేది.దాసరి ఆనాటి అగ్ర హీరోలందరితోనూ బ్లాక్ బస్టర్స్ తీశాడు.ఈ నేపథ్యంలో ఆ కాంబినేషన్‌పై విపరీతమైన క్రేజ్ నెలకొంది.డబ్బున్నవాళ్లను దోచుకొని లేనివాళ్లకు పంచిపెట్టే శివశంకర్ గా చిరంజీవి నటించాడు.
ఆయన సరసన హీరోయిన్ గా చేసింది రాధ.సత్యనారాయణ, మోహన్‌బాబు, రఘువరన్ విలన్ పాత్రలు చేశారు.చిరంజీవి చెల్లెలిగా రేవతి నటించింది.ఆమె భర్తగా కల్యాణ చక్రవర్తి యాక్ట్ చేశారు.
ఈ సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసుకుంది.అదే ఈ సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది.జనాల ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ కావడంలో ఈ సినిమా సక్సెస్ కాలేదు.ఓపెనింగ్స్ పరంగా మంచి రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా.మున్ముందు రోజుల్లో ఆ రేంజ్‌లో వసూళ్లను సాధించలేక పోయింది.లంకేశ్వరుడు యావరేజ్ గా నిలిచింది.
ఆ తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి సినిమాలు తీయలేదు.