శాన్ఫ్రాన్సిస్కోలో( San Francisco ) ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.అమీనా అనే 28 ఏళ్ల యువతి వేమో కంపెనీకి ( Waymo company )చెందిన సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీలో ప్రయాణిస్తుండగా ఊహించని సంఘటన ఎదురైంది.
మిషన్ స్ట్రీట్లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఇద్దరు వ్యక్తులు ఆమె టాక్సీని అడ్డగించారు.వారిలో ఒకడు ఆమెను ఫోన్ నంబర్ అడుగుతూ విసిగించాడు.
వద్దని చెప్పినా వినకుండా పదే పదే అడగడంతో అమీనా భయపడిపోయింది.డ్రైవర్ లేకుండా కేవలం టెక్నాలజీపై ఆధారపడే ఇలాంటి టాక్సీల్లో తమకు రక్షణ ఉండటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అమీనా( Amina ) గతంలోనూ చాలాసార్లు వేమో టాక్సీల్లో ప్రయాణించింది.కానీ ఈసారి అనుభవం ఆమెను తీవ్రంగా కలచివేసింది.ఈ ఘటనపై ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయింది.సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో మహిళల భద్రతపై తీవ్ర చర్చ మొదలైంది.
డ్రైవర్ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని, మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఈ ఘటన సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీల భద్రతపై పెద్ద ప్రశ్నార్థకాన్ని లేవనెత్తింది.
ఈ క్రమంలోనే ఈ షాకింగ్ ఘటనపై వేమో కంపెనీ స్పందించింది.ఒక ప్రకటన విడుదల చేస్తూ జరిగిన దానికి చింతిస్తున్నామని, ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ముఖ్యమని తెలిపింది.శాన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్లలో వారానికి లక్షలాది ట్రిప్పులు నడుపుతున్నామని, ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని వారు చెప్పారు.అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి 24/7 సపోర్ట్ అందిస్తున్నామని వేమో కస్టమర్లకు హామీ ఇచ్చింది.
అమీనా పోస్ట్ వైరల్ అయ్యాక ప్రయాణికులు త్వరగా అధికారులను అప్రమత్తం చేయడానికి లేదా అలారం మోగించడానికి వీలు కల్పించే ఫీచర్లు ఇలాంటి పరిస్థితుల్లో సహాయపడతాయని సోషల్ మీడియా యూజర్లు సూచించారు.డ్రైవర్ జోక్యం చేసుకోకుండా ప్రమాదకర ప్రాంతాల్లో ఉండటం వల్ల కలిగే నష్టాల గురించి మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు.