తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనియా ఆకుల( Bigg Boss contestant Sonia Akula ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సోనియా ఇటీవల తెలుగులో ముగిసిన బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చి భారీగా పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే.
ఈ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సోనియా భారీగా నెగెటివిటీని తెచ్చుకుంది.ఈ షోతో బోలెడంత నెగిటివీటీని సంపాదించుకుంది.
హౌస్‌లో ఎక్కువ వారాలు ఉండకుండానే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది.బిగ్బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత గత నెలలో నిశ్చితార్థం చేసుకున్న ఈమె ఇప్పుడు తాజాగా మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.
యష్ ( YASH )తో కలిసి తాజాగా ఏడడుగులు వేసింది.శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు బిగ్‌బాస్ 8లో పాల్గొన్న కంటెస్టెంట్స్ చాలామంది హాజరయ్యారు.నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో( social media ) వైరల్ కావడంతో అభిమానులు బిగ్ బాస్ ప్రేక్షకులు సోనియా ఆకుల దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా ఈ పెళ్లికి ఈ సీజన్ కంటెస్టెంట్స్ తో పాటుగా కొందరు ఇంతక ముందు సీజన్ కంటెస్టెంట్స్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది.
కాగా తెలంగాణలోని మంథని( Manthani ) కి చెందిన సోనియా యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా ఆర్జీవి తీసిన ఒకటి రెండు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.ఆ తర్వాత బిగ్బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి మొదట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత నిఖిల్ పృథ్వీలతో హగ్గులు ఇస్తూ లవ్ ట్రాక్లు నడిపి విపరీతమైన నెగెటివిటీని తెచ్చుకుంది.
ఇక ఆమె చేసే పనులు చూడలేక ప్రేక్షకులు కూడా ఎలిమినేట్ చేసి బయటకు పంపించేశారు.