సోషల్ మీడియా గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.ఎందుకంటే దేశంలోని యువత దాదాపు 70 శాతం మంది సోషల్ మీడియా బానిసలే అని సర్వేలు చెబుతున్నాయి.
అవును, ఒకప్పుడు టైం పాస్ కోసం జనాలు స్నేహితులతో గడిపేవారు.లేదంటే సినిమాలకు షికార్లకు వెళ్లేవారు.
కానీ ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ఇపుడు స్వయం తృప్తి అంటే… ఇంకేదో అనుకునేవారు… ఎవరికి వారే తమ సమయాన్ని సోషల్ మీడియా పుణ్యమాని కరిగించేస్తున్నారు.
ఈ క్రమంలోనే అనేక రకాల వీడియోలు నిత్యం ఇక్కడ వైరల్ ( Viral ) అవుతుంటాయి.వాటిలో వివాహానికి సంబంధించినవే ఎక్కువగా ఇక్కడ తెగ చక్కర్లు కొడుతుంటాయి అనడంలో అతిశయోక్తి లేదు.
అవును… ఎందుకంటే? దానికి కారణం లేకపోలేదు… వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి వీడ్కోలు కార్యక్రమం వరకూ అనేక సంఘటనలు ఇక్కడ చోటు చేసుకుంటాయి.వీటిలో కొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి.అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.విషయం ఏమిటంటే… వధువు డాన్స్( Bride Dance ) చేస్తుండగా వరుడు కూడా సినిమా హీరో మాదిరి డాన్సు చేయాలని చూడగా.
చివరకు అబాసుపాలయ్యాడు.దాంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
వీడియో వివరాల్లోకి వెళితే, బంధువుల సమక్షంలో వధువు డాన్స్ చేస్తోంది.ఆమె డాన్స్‌ను అంతా ఆకస్తిగా గమనిస్తున్నారు.అయితే అక్కడే ఉన్న వరుడు.( Groom ) ఆమె చేయి పట్టుకుని అటూ, ఇటూ తిప్పుతూ డాన్స్ చేయాలని యత్నించాడు.ఈ క్రమంలో అతను అత్యుత్సాహం ప్రదర్శించాడు.ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ బక్కబోర్లా కింద పడిపోయారు.
ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు.దాంతో ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా విషయం వెలుగు చూసింది.కాగా… ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.‘‘వరుడుకి తుత్తర ఎక్కువలాగుంది… ఫూల్ అయ్యాడుగా’’.
అంటూ కొందరు కామెంట్ చేస్తే, ‘‘పాపం! ఏదో చేయాలని చూస్తే.ఇంకేదో జరిగింది!’’.
అంటూ మరి కొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు.