బెల్లీ ఫ్యాట్ లేదా బాన పొట్ట(Belly Fat).ఆడ మగ అనే తేడా లేకుండా కోట్లాది మందిని కలవరపెట్టే కామన్ సమస్యల్లో ఇది ఒకటి.
పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోవడానికి వివిధ అంశాలు కారణం అవుతుంటాయి.శరీరానికి శ్రమ లేకపోవడం, గంటలు తరబడి కూర్చుని ఉండటం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి తదితర కారణాల వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా? పొట్ట కొవ్వును(Belly fat) కరిగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ (Magical drink)ను రెగ్యులర్ గా కనుక తీసుకుంటే నెల రోజుల్లో పొట్ట కొవ్వు కరిగిపోతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రెష్ గా తీసిన కలబంద జెల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత అదే మిక్సీ జార్ లో రెండు గింజ తొలగించి సన్నగా తరిగిన ఉసిరికాయలు(Amla) కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ తీసుకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ జ్యూస్, మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జ్యూస్(Aloe vera juice), వన్ టీ స్పూన్ అల్లం జ్యూస్(Ginger juice) మరియు వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేస్తే మన ఆమ్లా అలోవెరా జింజర్ జ్యూస్ అనేది రెడీ అవుతుంది.
పొట్ట కొవ్వును కరిగించడానికి ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు ఈ డ్రింక్ ను ప్రతిరోజు కనుక తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మొత్తం వెన్నల కరిగిపోతుంది.కొద్ది రోజుల్లోనే మీ బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు.రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రించే సామర్థ్యం కూడా ఈ డ్రింక్ కు ఉంది.పైగా ఈ డ్రింక్ శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపుతుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది.మరియు మలబద్ధకం సమస్య నుంచి సైతం ఉపశమనాన్ని అందిస్తుంది.