బాదంపప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం నుంచి అధిక బరువును తగ్గించడం వరకు, మెదడును చురుగ్గా మార్చడం దగ్గర నుంచి ఎముకలను బలోపేతం చేయడం వరకు ఇలా బాదం(Almond) తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
అయితే ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా పెంచే సత్తా బాదంకు ఉంది.మరి ఇంతకీ జుట్టు(Hair) పెరుగుదలకు బాదం ను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 10 బాదం గింజలు(Almonds) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నైట్ అంతా నానబెట్టి పొట్టు తొలగించిన బాదం గింజలు వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు అందులోనే బాగా పండిన ఒక అరటిపండును కూడా వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆముదం(Castor oil) మరియు వన్ టీ స్పూన్ బాదం నూనె(Almond oil) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
![Telugu Almond Benefits, Almond, Care, Care Tips, Tips, Healthy-Telugu Health Telugu Almond Benefits, Almond, Care, Care Tips, Tips, Healthy-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2024/12/try-this-almond-mask-for-improving-hair-growth.jpg)
వారానికి ఒకసారి ఈ ఆల్మండ్ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల అనేక లాభాలు చేకూరుతాయి.ముఖ్యంగా బాదంలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ ఇ, జింక్ మరియు పొటాషియం వంటి పోషకాలు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి.బాదంలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు జుట్టు రాలడాన్ని అరికడతాయి.
![Telugu Almond Benefits, Almond, Care, Care Tips, Tips, Healthy-Telugu Health Telugu Almond Benefits, Almond, Care, Care Tips, Tips, Healthy-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2024/12/try-this-almond-mask-for-improving-hair-growth-a.jpg)
అలాగే బాదంలో ఉండే బయోటిన్ జుట్టు వేగంగా మరియు బలంగా పెరగడంలో సహాయపడుతుంది.బాదంలో ఉండే ఐరన్ రక్త ప్రసరణను పెంచి ఆరోగ్యమైన కురులకు మద్దతు ఇస్తుంది.అంతేకాకుండా ఈ ఆల్మండ్ హెయిర్ ప్యాక్ జుట్టుకు తేమ అందించి, పొడిబారిన జుట్టును మృదువుగా సైతం మారుస్తుంది.