మచ్చలతో చింతేలా.. పటిక తో ఈజీగా వదిలించుకోండిలా!

సాధారణంగా కొందరికి ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి.ఇవి ఓ పట్టాన అస్సలు పోవు.

 How To Use Fitkari For Spotless Skin! Fitkari, Fitkari Benefits, Latest News, Sk-TeluguStop.com

ఇటువంటి మచ్చలను వదిలించుకోవడం కోసం రకరకాల క్రీమ్, సీరంలు(Various creams ,serums) వాడుతుంటారు.అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటే అస్సలు చింతించకండి.

నిజానికి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు మొండి మచ్చలు వదిలించడానికి చాలా ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.ఇప్పుడు చెప్పబోయే చిట్కా కూడా ఆ కోవకే చెందుతుంది.

సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్న ఖనిజం పటిక.దీనిని ఫిట్కారీ లేదా ఆలమ్(Fitkari ,alum) అని కూడా పిలుస్తారు.

చర్మ సంరక్షణకు పటిక చాలా బాగా సహాయపడుతుంది.ముఖ్యంగా మొండి మచ్చలు మాయం చేయడానికి, ముడతలను నిర్వారించడానికి, చర్మాన్ని అందంగా యవ్వనం గా మెరిసేలా ప్రోత్సహించడానికి పటికను మనం ఉపయోగించవచ్చు.

అందుకోసం ముందుగా మిక్సీ జార్(Mix jar) తీసుకుని అందులో పటిక వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసి స్టోర్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ పటిక పొడి, వన్ టీ స్పూన్ ముల్తాని మట్టి(Alum powder, multani mitti) మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Telugu Alum Powder, Tips, Clear Skin, Skin, Latest, Skin Care, Skin Care Tips, S

వారానికి రెండు సార్లు ఈ సింపుల్ రెమెడీని కనుక పాటించారంటే అద్భుత ప్రయోజనాలు పొందుతారు.ముఖ్యంగా ఈ రెమెడీ చర్మం పై ఎటువంటి మచ్చలనైనా పోగొడుతుంది.స్కిన్ టోన్(Skin tone) ను ఈవెన్ గా మారుస్తుంది.అలాగే పటికలో యాంటిసెప్టిక్, ఆస్ట్రింజెంట్ గుణాలు ఉంటాయి.ఇవి చర్మాన్ని బిగుతుగా మార్చడానికి సహాయ పడతాయి.ముడతలు రాకుండా అడ్డుకుంటాయి.

అంతే కాకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని పాటిస్తే మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.చర్మ కణాలు లోతుగా శుభ్రం అవుతాయి.

డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి చర్మం తాజాగా కాంతివంతంగా సైతం మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube