తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.అయితే అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప 2 సినిమా( Pushpa 2 ) కోసం 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అంటూ భారీ వార్తలైతే వస్తున్నాయి.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నప్పటికి మరి కొంతమంది మాత్రం ఇది జస్ట్ క్రేజ్ కోసమే అలాంటి ఒక రూమర్ ని క్రియేట్ చేశారంటూ కొన్ని వార్తలైతే స్ప్రెడ్ చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అల్లు అర్జున్ కి 300 కోట్ల రెమ్యూనరేషన్ అనేది భారీ మొత్తంలో ఇచ్చారు అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

ఇక ప్రస్తుతం పుష్ప 2 అందుకుంటున్న విజయాన్ని, దక్కించుకుంటున్న కలెక్షన్స్ ని( Pushpa 2 Collections ) చూస్తుంటే అల్లు అర్జున్ కి 300 కోట్లు ఇవ్వడంలో తప్పులేదని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా 1500 కోట్ల మార్కును దాటి రెండు వేల కోట్ల టార్గెట్ ను రీచ్ అయ్యే విధంగా ముందుకు సాగుతుంది.మరి ఇలాంటి సందర్భంలో పుష్ప 2 ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి… మరి ఈ సినిమా కనక 2000 కోట్లు మార్కు దాటినట్టైతే ఇండియాలోనే పుష్ప 2 సినిమా నెంబర్ వన్ సినిమాగా నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

ఇక మరికొద్ది రోజుల్లో పుష్ప 2 సినిమా రెండు వేల కోట్ల మార్కును ఈజీగా దాటుతుంది అంటూ అతని అభిమానులు చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు… ఇక ఇది ఏమైనా కూడా ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత వసూళ్లను కలెక్ట్ చేస్తుందనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.