చర్మంపై బ్రౌన్ స్పాట్స్ తొలగించుకోవడానికి ఇంటి చిట్కాలు

ముఖంపై బ్రౌన్ స్పాట్స్ ఉంటే ముఖం అందంగా లేకుండా అందవిహీనంగా ఉంటుంది.వాటిని వదిలించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయారా ? అయితే ఈ ఆర్టికల్ లో ముఖంపై బ్రౌన్ స్పాట్స్ ఎలా వదిలించుకోవాలో సులభమైన మార్గాల గురించి చెప్పుతున్నాం.ఈ చిట్కాలను పాటించి బ్రౌన్ స్పాట్స్ నుండి బయట పడండి.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

 Brown Spots Best Homeremedies-TeluguStop.com

ఆపిల్ సిడర్ వెనిగర్ లో కాటన్ బాల్ ముంచి బ్రౌన్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మజ్జిగలో కాటన్ బాల్ ముంచి బ్రౌన్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో రాసి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆముదంను బ్రౌన్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో రాసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తాజా టమోటా గుజ్జును బ్రౌన్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో రాసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా బ్రౌన్ స్పాట్స్ తొలగిపోతాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు