బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎందుకంటే ఇప్పటి వరకూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రేక్షకులందరితో కండల వీరుడిగా పిలిపించుకున్నాడు.
ఇక ఎంత కావాలో అంత కంటే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు.సినిమాల ద్వారా కోట్లు సంపాదించి ప్రస్తుతం లగ్జరీ లైఫ్ గడిపేస్తున్నాడు.
అయితే ఇటీవలి కాలంలో మాత్రం సల్మాన్ ఖాన్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.సినిమాల విషయంలో కాదు సల్మాన్ ఖాన్ హత్యకు సంబంధించి హెచ్చరికల విషయంలో అతను వార్తల్లో నిలుస్తున్నాడు.
సల్మాన్ ఖాన్ హత్య చేయడానికి లారెన్స్ బిష్ణయ్ గ్యాంగ్ సిద్ధం అయ్యింది.ఒకవేళ ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్బి సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.ఇటీవలి పోలీసుల అదుపులో ఉన్న లారెన్స్ బిష్ణయ్ గ్యాంగ్ సభ్యుడు కపిల్ పండిట్ ను విచారించిన సమయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అనేది తెలుస్తుంది.పంజాబ్ సింగర్ మూసేవాలా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పంజాబ్ ఢిల్లీ పోలీసుల విచారణలో ఊహించని నిజాలు బయటపడ్డాయి.
సల్మాన్ హత్యకు లారెన్స్ బిష్ణయ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.
ఒకవేళ ఇంటి దగ్గర కాకపోతే ఇక సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ సమీపంలో హత్య చేయాలని లారెన్స్ బిష్ణయ్ గ్యాంగ్ సిద్ధమైందట.ముంబై శివార్లలో సల్మాన్ ఖాన్ కు విశాలమైన ఫాంహౌస్ ఉంది.సెలవు ఎక్కువగా అక్కడికి వెళుతూ ఉంటారు.
లాక్ డౌన్ సమయంలోనే ఫామ్హౌస్కు పరిమితం అయ్యారు సల్మాన్ ఖాన్.రెక్కి నిర్వహించిన లారెన్స్ బిష్ణయ్ సల్మాన్ ఖాన్ ఫాం హౌస్లో సమీపంలో రెండు నెలలు తిష్టవేసి ఆయుధాల వాహనాలను సిద్ధం చేసుకున్నారట.
సల్మాన్ ఖాన్ తో బాడీ గార్డ్ ఒక్కడే ఉంటాడు అని తెలుసు.దీంతో సింపుల్గానే కాల్పులు జరిపాలని నిర్ణయించుకుందట.
ఇది మాత్రం సంచలనంగా మారింది అని చెప్పాలి.