29 రోజుల్లో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్

నేటి రోజుల్లో సినిమా తీయాలంటే దాదాపు రెండేళ్లు.అదే స్టార్ హీరోలు అయితే మూడేళ్లు, కానీ అప్పట్లో పరిస్థితులు అలా ఉండేవి కాదు.

 Do You Know These Things About Chiranjeevi , Chiranjeevi, Rajasekhar, Entlo Rama-TeluguStop.com

ఏడాదికి నాలుగు నుంచి ఐదు సినిమాలు హీరోలు రిలీజ్ చేసేవారు.ఇప్పుడు కూడా కొంతమంది స్టార్ హీరోలు ఏడాదికి రెండు సినిమాలు తీస్తున్న ఇండస్ట్రీకి హిట్స్ మాత్రం తక్కువే ఉంటున్నాయి.

కానీ ఇలాంటి ఒక సినారియోలో కేవలం 29 రోజుల్లోనే ఒక సినిమాను తీసి విడుదల చేయడం అనేది నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయం.కానీ అలా జరిగింది కేవలం 29 రోజుల్లోనే మెగాస్టార్ అంటే హీరోని పెట్టుకుని ఒక సినిమా తీసి విడుదల చేసి హిట్టు కొట్టారు ప్రొడ్యూసర్ కే రాఘవ.

ఇక సినీ ఇండస్ట్రీకి రాఘవ ఇచ్చిన రెండు అద్భుతమైన కానుకలు ఒకరు దర్శకేంద్రుడు దాసరి నారాయణరావు మరొకరు కోడి రామకృష్ణ.దాసరి శిష్యుడు కోడి రామకృష్ణ కానీ వీరిద్దరిలో ఉన్న టాలెంట్ ని గమనించిన రాఘవ వీరికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు.

దాసరిని తాతా మనవడు సినిమాతో ఇండస్ట్రీకి తీసుకురాగా కోడి రామకృష్ణను ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశాడు రాఘవ.ఇక ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా కేవలం 29 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసుకుని 500ల రోజులకు పైగా ఆడి ఘన విజయాన్ని అందుకుంది.

Telugu Chiranjeevi, Dasari Yana Rao, Entloramayya, Rajasekhar-Telugu Stop Exclus

ఇక ఈ సినిమాలో మాటల రచయితగా ఉన్న గొల్లపూడి ని నటుడిగా కూడా పరిచయం చేశారు రాఘవ.ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఒక మైలురాయిగా మిగిలిపోయింది.అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా మాధవి నటించింది.ఇక ఈ చిత్రంలో ఇంట్లో భార్య అంటే ఎంతో గౌరవం ఉండి బయటకు వెళ్ళగానే చిలిపి కృష్ణుడిగా అవతారం మార్చే రాజశేఖర్ పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించాడు.

ఈ సినిమా విడుదల ఇప్పటికే నాలుగు దశాబ్దాలు గడిచిపోయిన చిరంజీవి హిట్ మూవీస్ విషయంలో ముందు వరసలో ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube