యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కెరీర్ తొలినాళ్లలో బొద్దుగా కనిపించినా తర్వాత రోజుల్లో 30 కేజీల బరువు తగ్గారనే సంగతి తెలిసిందే.లైపోసక్షన్ చేయించడం ద్వారా తారక్ బరువు తగ్గడం జరిగింది.
అయితే తారక్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో బొద్దుగా కనిపించగా తారక్ బరువు తగ్గడానికి( Tarak Weight Loss ) ఒక ఇంజెక్షన్ వాడారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
డ్రాగన్ సినిమాలో( Dragon Movie ) తారక్ సినిమాలో స్లిమ్ లుక్ లో కనిపించనున్నారు.
అయితే ఒజెంపిక్ అనే ఇంజక్షన్ పై తారక్ బరువు తగ్గడానికి ఆధారపడ్డారని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తారక్ న్యాచురల్ గానే సన్నబడ్డారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హెల్తీ డైట్ ను ఫాలో కావడం వల్లే తారక్ బరువు తగ్గారని తెలుస్తోంది.దేవర మూవీ( Devara ) జపాన్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.క్రమశిక్షణ, పట్టుదలతో తారక్ కెరీర్ పరంగా ముందడుగులు వేస్తున్నారు.తగిన రీతిలో వర్కవుట్స్ చేయడం ద్వారా తారక్ ప్రశంసలు అందుకుంటున్నారు.ఈ నెల 22వ తేదీ నుంచి తారక్ షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం అందుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తారక్ కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నారు.ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.తారక్ ఈ సినిమాలో రెండు లుక్స్ లో కనిపించనున్నారని భోగట్టా.
ప్రశాంత్ నీల్ తారక్ తో ఎలాంటి ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తారో చూడాల్సి ఉంది.జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలు సొంత బ్యానర్ లో తెరకెక్కుతుండటంతో తారక్ రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.







