సాధారణంగా ఒక్కోసారి ముఖ చర్మం నల్లగా మారిపోతూ ఉంటుంది.వేడి వేడి నీటితో స్నానం చేయడం, కెమికల్స్ అధికంగా ఉండే సోప్స్ ను వినియోగించడం, హార్మోన్ల ప్రభావం, ఒత్తిడి, ఎండల్లో తిరగడం, పలు అనారోగ్య సమస్యలు తదితర కారణాల వల్ల చర్మంలో మెలనిన్ కంటెంట్ పెరుగుతుంది.
దాంతో రోజురోజుకు స్కిన్ డార్క్ గా( Dark Skin ) మారుతూ ఉంటుంది.అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని ఇంటి చిట్కాలు తోడ్పడతాయి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టిప్ -1:
ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బాదం పౌడర్,( Badam Powder ) వన్ టేబుల్ స్పూన్ చందనం పౌడర్( Sandalwood Powder ) మరియు సరిపడా పాలు( Milk ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ పైప్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే డార్క్ స్కిన్ మళ్లీ వైట్ గా మారుతుంది.బ్రైట్ గా మెరుస్తుంది.

టిప్-2:
ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి,( Cinnamon ) రెండు నుంచి మూడు టీ స్పూన్లు తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టి వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.ఈ చిట్కాను పాటించిన కూడా చర్మంలో మెలనిన్ కంటెంట్ తగ్గుతుంది.స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.
ఇక ఈ టిప్స్ ను ఫాలో అవ్వడం తో పాటు వేడి వేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయండి.కెమికల్స్ నిండి ఉన్న సోప్స్ ను ఎవైడ్ చేయండి.
ఎండల్లో తిరగడం తగ్గించండి.సన్ స్క్రీన్ ను తప్పకుండా ఉపయోగించండి.
నిత్యం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తీసుకోండి.మరియు డైట్ లో ఆకుకూరలు, తాజా కూరగాయలు, పండ్లు, సీడ్స్, నట్స్ వంటి హెల్తీ ఫుడ్స్ ను చేర్చుకోండి.