రక్తహీనత( Anemia ).మనలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న కామన్ సమస్యల్లో ఇది ఒకటి.
పిల్లల నుంచి పెద్దల వరకు ఎందరో రక్తహీనతకు బాధితులుగా ఉన్నారు.రక్తహీనత అనుకున్నంత చిన్న సమస్య కాదు.
దాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతుంది.కాబట్టి రక్తహీనతను వీలైనంత త్వరగా వదిలించుకోవాలి.
అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా తోడ్పడతాయి.ఇప్పుడు చెప్పబోయే లడ్డూ కూడా ఆ కోవకే చెందుతుంది.
ఈ లడ్డూను రోజుకొకటి చొప్పున తింటే ఎలాంటి రక్తహీనత అయినా బలాదూర్ అవ్వాల్సిందే.

లడ్డూ తయారీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వేయించిన నువ్వులు, ఒక కప్పు వేయించి పొట్టు తొలగించిన వేరుశనగలు, పావు కప్పు వేయించిన బాదం గింజలు వేసి బరకగా గ్రైండ్ చేయాలి.ఆపై అందులో పావు కప్పు వేయించిన ఎండు కొబ్బరి, ఒకఎండు కొబ్బరి, కప్పు బెల్లం తురుము, హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరి చుట్టుకుని బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.

ఈ లడ్డూలో అనేక రకాల విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.ఈ లడ్డూను రోజుకొకటి చొప్పును తీసుకుంటే శరీరానికి పుష్కలంగా ఐరన్ కంటెంట్ అందుతుంది. హిమోగ్లోబిన్( Hemoglobin ) శాతం పెరుగుతుంది.రక్తహీనత సమస్య పరార్ అవుతుందిఅలాగే ఈ లడ్డూను నిత్యం తినడం వల్ల ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది.మోకాళ్ళ నొప్పుల పరార్ అవుతాయి.అంతేకాకుండా ఈ లడ్డూ మెదడు పనితీరును పెంచి జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది.
జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.మరియు చెడు కొలెస్ట్రాల్( Bad cholesterol ) ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
దాంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.







