సాధారణంగా పెళ్లైన ప్రతి మహిళ త్వరగా గర్భం దాల్చాలని, అమ్మ అని పిలిపించుకోవాలని కలలు కంటుంటుంది.ఇక ప్రెగ్నెన్సీ రాగానే పట్టారని సంతోషం గిలిగింత పెడుతుంటుంది.
ఈ క్రమంలోనే పుట్టే బిడ్డపై ఎన్నో ఆశలు.మరెన్నో కోరికలు.
అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఆనందంతో పాటు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి.ముఖ్యంగా ఆ సమయంలో చాలా మంది ఐరన్ లోపాన్ని ఎదుర్కొంటారు.
ఈ ఐరన్ లోపం వల్ల మరెన్నో సమస్యలతో బాధపడుతుంటారు.
ప్రెగ్నెన్సీ సమయంలో ఐరన్ లోపించడం వల్ల హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడంతో రక్త హీనత ఏర్పడుతుంది.
అలాగే ఐరన్ లోపించడం వల్ల నీరసం, తలనొప్పి, త్వరగా అలసిపోవడం, ఆకలి లేకపోవడం, హార్ట్ బీట్ పెరగడం, శరీర రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం ఇలా రకరకాల సమస్యలు వస్తుంటాయి.ఇక కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే ఐరన్ తప్పనిసరి.
కానీ, ఐరన్ లోపించడం వల్ల బిడ్డ ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో ఐరన్ లోపించడం వల్ల చాలా డేంజరని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి, ఆ సమయంలో ఖచ్చితంగా ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారం ఏంటో ఓ సారి చూసేయండి.
పాలకూరను ప్రతి రోజు తీసుకోవాలి.ఎందుకంటే, పాలకూర ఐరన్ లోపాన్ని నివారిస్తుంది.
మాంసం, గుడ్లు, చేపలు, పుట్టగొడుగులు, పాలు మరియు పాల ఉత్పత్తులను డైట్‌లో చేర్చుకోవాలి.అలాగే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, ఎండు కర్జూరాలు, కిస్‌మిస్ వంటి తీసుకోవడం వల్ల కూడా ఐరన్ కంటెంట్ పెరుగుతుంది.
దానిమ్మ పండు, కివి పండ్లు, కమలా పండు, స్ట్రాబెర్రీస్, అరటి పండు, యాపిల్స్ కూడా ఐరన్ లోపాన్ని నివారిస్తాయి.మరియు బీట్‌రూట్, క్యారెట్ వంటివి కూడా తీసుకోవాలి.
అప్పుడు గర్భిణి స్త్రీలలో ఐరన్ లోపం తగ్గి.కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడు.