వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు( Skin Wrinkles ) పడడం అనేది చాలా కామన్.కానీ ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది చిన్న వయసులోనే ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఇందుకు అనేక అంశాలు కారణం అవుతున్నాయి.ఏదేమైనా ముడతలు అందాన్ని పాడు చేస్తాయి.
ముసలి వారిలా చూపుతాయి.అయితే చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వచ్చాయని బాధపడుతున్న వారు, అసలు ముడతలకే దూరంగా ఉండాలని భావిస్తున్న వారు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని తప్పకుండా ప్రయత్నించండి.
ముందుగా నాలుగు బాదం గింజలను( Almonds ) శుభ్రంగా కడిగి వాటర్ లో నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు బాదం గింజల పొట్టు తొలగించి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ బాదం పేస్ట్ లో వన్ టీ స్పూన్ తేనె,( Honey ) చిటికెడు పసుపు,( Turmeric ) పావు టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని సున్నితంగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
ఆపై చర్మాన్ని పది నిమిషాల పాటు ఆరబెట్టుకుని అప్పుడు తడి క్లాత్ సహాయంతో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

వారానికి కనీసం రెండు లేదా మూడుసార్లు ఈ రెమెడీని కనుక పాటించారంటే మీరు ఆశ్చర్యపోయే స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.బాదం చర్మ కణాలను పునరుజ్జీవింపజేసి, ముడతలు, చారలు వంటి చర్మం సమస్యలను దూరం చేస్తుంది.యవ్వనమైన మెరిసే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.
బాదంలో ఉన్న విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని హానికరమైన యూవీ కిరణాల నుండి కాపాడతాయి.

పైన చెప్పుకున్న ఆల్మండ్ మాస్క్ ను తరచూ ప్రయత్నించడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.పొడి చర్మం సమస్య దూరం అవుతుంది.నలుపు మచ్చలు ఏమైనా ఉంటే తగ్గు ముఖం పడతాయి.
స్కిన్ టోన్ ఈవెన్ గా సైతం మారుతుంది.