ప్రస్తుత వర్షాకాలంలో వైరల్ ఫీవర్( Viral Fever ) కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.వైరల్ ఫీవర్ అనేది వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల తలెత్తుతుంది.
పిల్లలు పెద్దలు, అనే తేడా లేకుండా ఎంతో మంది వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు.ఈ వైరల్ ఇన్ఫెక్షన్ శరీరంలోని ఏ భాగం నుంచి అయినా సంభవించవచ్చు.
ఫలితంగా జ్వరం బారిన పడతారు.వైరల్ ఫీవర్ ఒక అంటువ్యాధి.
ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది.కాబట్టి వైరల్ జ్వరానికి గురైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.
![Telugu Ginger, Tips, Latest, Monsoon, Recovery Foods-Telugu Health Telugu Ginger, Tips, Latest, Monsoon, Recovery Foods-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2024/08/fever-recovery-foods-latest-news-health-health-tips-good-health-Monsoon-fever.jpg)
అలాగే వైరల్ ఫీవర్ నుంచి తొందరగా రికవరీ అవ్వడానికి కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.అటువంటి వాటిల్లో ఫ్రెష్ వెజిటేబుల్ జ్యూసులు ముందు వరుసలో ఉంటాయి.వెజిటేబుల్ జ్యూసులు ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి.
నీరసం, అలసటను దూరం చేస్తాయి.వైరల్ ఫీవర్ నుంచి వేగంగా కోలుకోవడానికి తోడ్పడతాయి.
![Telugu Ginger, Tips, Latest, Monsoon, Recovery Foods-Telugu Health Telugu Ginger, Tips, Latest, Monsoon, Recovery Foods-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2024/08/viral-fever-viral-fever-recovery-foods-latest-news-health-health-tips-good-health-Monsoon-fever.jpg)
అలాగే వైరల్ ఫీవర్ కు గురైనప్పుడు నోటికి ఏది రుచించదు.అలాంటి టైంలో వేడి వేడి చికెన్ సూప్ తీసుకోవడం ఎంతో మొత్తం.చికెన్ సూప్ మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తుంది.బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది.వెల్లుల్లి కూడా వైరల్ ఫీవర్ నుంచి తొందరగా రికవరీ అవ్వడానికి సహాయపడుతుంది.జ్వరంగా ఉన్నప్పుడు వికారం, వాంతులు నుంచి రిలీఫ్ అందించడానికి అల్లం ( Ginger )తోడ్పడుతుంది.
వైరస్ ఫీవర్ కు గురైనప్పుడు కచ్చితంగా రోజుకొక కివి పండు( Kiwi Fruit )ను తీసుకోండి.కివి పండులో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచి తొందరగా ఫీవర్ ను తగ్గిస్తాయి.
మరియు కివి పండులో ఉండే ఇతర పోషకాలు బాడీని ఎనర్జిటిక్ గా మారుస్తాయి.ఇక వైరల్ ఫీవర్ నుంచి త్వరగా బయటపడటానికి గ్రీన్ టీ కూడా హెల్ప్ చేస్తుంది.
ఒక కప్పు గ్రీన్ టీ మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.వైరల్ ఫీవర్ ని తరిమి కొడుతుంది.