తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.ఇక అందులో రామ్ ( Ram Pothineni )ఒకడు.
ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్( Double iSmart )’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ తనదైన రీతిలో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా గుర్తింపు పొందే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేకపోయిందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.
పూరి జగన్నాథ్ తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా చాలా బ్లండర్ మిస్టేక్స్ చేశారని భారీ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ కథ పరంగా ఎవరిని ఇంప్రెస్ చేయలేకపోయిందని సగటు ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ సక్సెస్ అయిందని అదే ప్రాంచైజ్ లో ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేసి భారీ మిస్టేక్ ను కూడా చేశాడు అంటూ మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాలను అయితే తెలియజేసారు.
ఇక మొత్తానికైతే ఈ సినిమా మొదటి షో తోనే ప్లాప్ టాక్ తెచ్చుకోవడం అనేది నిజంగా ఒక వంతుకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.ఇంక బ్యాక్ టు బ్యాక్ రామ్ కి స్కంద, డబుల్ ఇస్మార్ట్ అ( Double iSmart , Skanda, )నే సినిమాలతో ఫ్లాపులు రావడంతో ఆయన కెరియర్ అనేది అగమ్యాగోచరంగా కనిపిస్తుంది.ఇక ఇప్పుడు కనక ఆయన మంచి సినిమా చేసి భారీ సక్సెస్ ని అందుకోకపోతే మాత్రం ఆయన మార్కెట్ విపరీతంగా డౌన్ అవ్వడమే కాకుండా అభిమానుల్లో క్రేజ్ కూడా భారీ గా తగ్గిపోతుందనే చెప్పాలి… ఇక ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో రామ్ కి అర్జెంట్ గా ఒక హిట్ అయితే కావాలి.మరి ఆయనకి హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరు అనేది తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే…
.