1.లోకేష్ పాదయాత్ర

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటికి 500 రోజులు పూర్తయింది.
2.కవితకు ఈడి సమన్లపై కేటీఆర్ స్పందన
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేయడంపై తెలంగాణ మంత్రి కవిత సోదరుడు కేటీఆర్ స్పందించారు.తమ మంత్రులపై ఇప్పటికే దాడులు చేశారని, బిజెపి దర్యాప్తు సంస్థలను ఏ విధంగా ఉసుగొల్పుతుందో అందరికీ అర్థం అవుతోందని కేటీఆర్ మండిపడ్డారు.
3.ఛత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్

ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది.ఈ ఘటనలో దాదాపు ఆరుగురు నక్సలైట్లు గాయపడినట్లు సమాచారం.
4.వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.మొత్తం ఏడుగురు వైసీపీ అభ్యర్థులు దాఖలు చేశారు.
5.ఈడి నోటీసులపై కవిత కామెంట్స్

దర్యాప్తు సంస్థలు మహిళలను విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
6.కవితపై భట్టి విక్రమార్క విమర్శలు
నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శలు చేశారు.
7.బి ఆర్ ఎస్ కు జడ్పీ చైర్మన్ రాజీనామా

వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి బీఆర్ ఎస్ కు రాజీనామా చేశారు.ఆయనతో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు రాజీనామా చేశారు.
8.వైరల్ ఫీవర్ పై మంత్లీ రజిని సమీక్ష
ఏపీలో వైరల్ ఫీవర్స్ వడదెబ్బలపై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.జూమ్ ద్వారా వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజిని సమీక్ష సమావేశం నిర్వహించారు.
9.నేడు ఆస్ట్రేలియా భారత్ మ్యాచ్

నేడు ఆస్ట్రేలియా భారత్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
10.ఏపీ జెఎసి సమావేశం
ఈరోజు ఉదయం 9 గంటలకు ఏపీ జేఏసీ అమరావతి అత్యవసర సమావేశం నిర్వహించింది.ఉద్యమ కార్యాచరణ కొనసాగింపు పై ఈ సమావేశంలో చర్చించుకున్నారు.
11.సోము వీర్రాజు పర్యటన

నేడు బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విశాఖలో పర్యటించనున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరును వీర్రాజు పరిశీలిస్తారు.
12.పదవ తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు
నేటి నుంచి పదవ తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు ఏపీలో జరుగనున్నాయి.43,000 మంది విద్యార్థుల కోసం 20041 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
13.ఉపాధ్యాయుల ఆందోళనకు మద్దతు

నేడు రాజమండ్రిలో సిపిఎస్ రద్దు కోరుతూ ఉపాధ్యాయ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు వామపక్ష పార్టీలు మద్దతుగా ధర్నా నిర్వహించాయి.
14.ఎన్ ఫీల్డ్ హిమాలయన్ బైకులు వెనక్కి
రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు 5000 యూనిట్ల హిమాలయన్ బైకులకు రీకాల్ ప్రకటించింది.
15.ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో మరొకరి అరెస్ట్

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం కేసులు మరో అరెస్ట్ జరిగింది.సీమెన్స్ మాజీ ఉద్యోగి జేవీఎస్ భాస్కర్ ను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
16.ఢిల్లీలో కవిత దీక్షకు అనుమతి నిరాకరణ
చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలనే డిమాండ్ తో భారత్ జాగృతి అధ్యక్షురాలు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన నిరసన దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.
17.జగన్ సమీక్ష

విజయవాడలో అంబేడ్కర్ స్మృతి వనం పనులపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
18.బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థులు తమనామినేషన్ దాఖలు చేశారు .అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్ల వెంకట్రామిరెడ్డి నామినేషన్ పత్రాలు అసెంబ్లీ లాబీల్లో ని రిటర్నింగ్ ఆఫీసర్ కు సమర్పించారు.
19.సోము వీర్రాజు విమర్శలు

ఉద్యోగుల జీవితాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -50,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,530
.