1. యువగళం పాదయాత్ర

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర ( Yuvagalam )తాడిపత్రి నియోజకవర్గంలో కి ప్రవేశించింది .ఫ్యాక్షన్ నియోజకవర్గం కావడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అంటూ లోకేష్ కు తాడిపత్రి డిఎస్పి చైతన్య సూచించారు.
2.సచిన్ పైలెట్ నిరాహార దీక్ష
రాజస్థాన్ లోని గత ప్రభుత్వ అవినీతి పై చర్యలకు డిమాండ్ చేస్తూ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ జైపూర్ లోని సహిత్ సమర్క్ వద్ద నిరాహారదీక్షకు దిగారు.
3.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసు(TSPSC Paper Leak )లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది.
4.తిరుమల సమాచారం
తిరుమల( Tirumala )లో భక్తుల రద్దీ కొనసాగుతోంది .నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు 20 గంటల సమయం పడుతోంది.
5.శానటరి ప్యాడ్ల పంపిణీపై జాతీయ విధానం
బాలికలకు ఉచితంగా శానటరి ప్యాడ్ల కంపెనీపై దేశవ్యాప్తంగా ఓకే విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
6.కర్ణాటకలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం

కర్ణాటక ఎన్నికల్లో( Karnataka Electio ) జేడీఎస్ కు మద్దతుగా తెలంగాణ సీఎం కేసీఆర్ , ఆయన మంత్రి వర్గంలో కొందరు మంత్రులు , ఎమ్మెల్యే లు ప్రచారానికి వస్తారని, ఆ పార్టీ నేత, మాజీ సీఎం కుమార స్వామి తెలిపారు.
7.కేసీఆర్ పై రేవంత్ కామెంట్స్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కామెంట్స్ చేశారు.హైదరాబాద్ భూములపై లక్ష కోట్లు దొచుండు అంటూ విమర్శలు చేశారు.
8.అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై సమీక్ష
హైదరాబాద్ లో 125 అడుగుల విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఈనెల 14న ఆవిష్కరించనున్నారు.ఈ కార్యక్రమం ఏర్పాటుకు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , మంత్రి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి , నిరంజన్ రెడ్డి , గంగుల కమలాకర్ తదితరులు సమీక్షించారు.
9.కవిత కాలుకి ప్యాక్చర్
ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత కాలుకి ప్రాక్చర్ అయింది.మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.
10.సల్మాన్ ఖాన్ కి మరో బెదిరింపు

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరో బెదిరింపు కాల్ వచ్చింది.ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఈనెల 30న సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని ఓ వ్యక్తి బెదిరించాడు.
11.కేసీఅర్ పై భట్టి విక్రమార్క విమర్శలు
కెసిఆర్ ను ఇలాగే వదిలేస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.
12.నందమూరి లక్ష్మీపార్వతి కామెంట్స్
తెలుగు అకాడమీకి పూర్వ వైభవం తీసుకొస్తామని తెలుగు, సంస్కృతం అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు.
13.గవర్నర్ తీరుపై కేటీఆర్ కామెంట్స్
బిజెపియేతర రాష్ట్రాలపై కక్ష సాధింపు కోసమే గవర్నర్లను వాడుకుంటున్నారని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శించారు .
14.భారత్ లో ముస్లిం జనాభా అధికం

భారత్ లో ముస్లిం జనాభా అధికం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు.
15.ట్విట్టర్ ఖాతాల విషయంలో కేంద్రానికి హైకోర్టు ప్రశ్న

ట్విట్టర్ లో కొన్ని ఖాతాలను బ్లాక్ చేయడానికి కారణాలను ఎందుకు చెప్పలేదని కర్ణాటక హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.
16.పవన్ పై అంబటి రాంబాబు విమర్శలు
జనసేన పార్టీ పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు.
అసలు పార్టీ ఎందుకు పెట్టరో పవన్ కే తెలియదని రాంబాబు ఎద్దేవా చేశారు
17.సంజయ్ రిమాండ్ రద్దు పై విచారణ

పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్ రద్దు పై హై కోర్టు లో నేడు విచారణ జరగనుంది.
18.ఎమ్మెల్యే ను అడ్డుకున్న ఆదివాసీలు
అల్లూరి సీతారామరాజు జిల్లా మారెడుమిల్లి లో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ని ఆదివాసీయులు అడ్డుకున్నారు.జీవో నంబర్ 52 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
19.సెల్ ఫోన్ డౌన్ నిరసన
నేడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సెల్ ఫోన్ డౌన్ నిరసన కార్యక్రమం చేపట్టారు.
20.నేటి నుంచి ఎండలు తీవ్రం
నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్ర తరం కానున్నాయి.ఈ మేరకు వాతావరణ శాఖ హై అలెర్ట్ ప్రకటించింది.