కూల్ డ్రింక్స్ త్రాగుతున్నారా.... అయితే పెద్ద ప్రమాదంలో పడినట్టే

Cool Drinks Are Very Dangerous To Health

ఎండలు పెరిగిపోయాయి.బయటకు వెళ్లాలంటేనే వడదెబ్బ తగులుతుందని భయం వేస్తుంది.

 Cool Drinks Are Very Dangerous To Health-TeluguStop.com

చాలా మంది ఇల్లు వదిలి బయటకు రావటం లేదు.కానీ కొంత మంది పనుల కారణంగా బయటకు వస్తున్నారు.

అలాంటి వారు వేసవి తాపాన్ని తగ్గించుకోవటానికి కూల్ డ్రింక్స్ త్రాగుతున్నారు.వేసవి కాలంలో కూల్డ్రింక్స్ శక్తిని ఇస్తాయని,దాహం తీరుతుందని భావించి కాస్త ఎక్కువగానే త్రాగేస్తున్నారు.

అయితే కూల్ డ్రింక్స్ ఎక్కువగా త్రాగటం వలన చాలా రకాల సేడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

కూల్ డ్రింక్స్ ఎక్కువగా త్రాగటం వలన వాటిల్లో ఉండే చక్కర ఎక్కువగా కేలరీలను ఇస్తుంది.దాంతో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కూల్ డ్రింక్స్ లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది.కెఫీన్ మోతాదుకు మించితే శరీరంపై దుష్ప్రభావాలను చూపుతుంది.గుండె కొట్టుకొనే తీరులో మార్పులు,రక్తపోటు పెరగటం, కొన్ని సందర్భాలలో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.కాబట్టి సాధ్యమైనంత వరకు కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండటమే మంచిది.

కూల్ డ్రింక్స్ ఎక్కువగా త్రాగటం వలన కిడ్నీలపై విపరీతమైన భారం పడుతుంది.కూల్ డ్రింక్స్ లో ఉండే పదార్ధాలను బయటకు పంపటానికి ఎక్కువ మొత్తంలో నీటిని వినియోగించుకోవటం వలన డీహైడ్రేషన్ బారిన పడతాం.

కూల్ డ్రింక్స్ లో ఉండే యాసిడ్స్, చక్కెర దంతాలపై ఉండే ఎనామిల్ పొరకు హాని చేస్తాయి.దాంతో దంత క్షయం ఏర్పడి దంతాలు చాలా సెన్సిటివ్ గా మారిపోతాయి.

కాబట్టి ఈ వేసవికాలంలో కూల్ డ్రింక్స్‌ను కాకుండా కొబ్బ‌రి నీళ్లు, స‌హ‌జ‌సిద్ధంగా ఇంట్లో త‌యారు చేసుకునే శీత‌ల పానీయాలు, నిమ్మ ష‌ర్బ‌త్‌, పండ్ల ర‌సాలు తాగితే వేసవి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube