ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియో అందరి హృదయాలను కదిలిస్తోంది.ఓ చిన్న కుక్కపిల్ల చెట్టుపై చిక్కుకుపోయి, కిందకు దిగలేక భయంతో వణికిపోతుంటే.
అనుకోకుండా అక్కడికి వచ్చిన ఓ కోతి( monkey ) దానికి సాయం చేసింది.ఈ అద్భుతమైన రెస్క్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే, ఓ కాలనీలో ఆడుకుంటున్న కుక్కపిల్ల అనుకోకుండా చెట్టు ఎక్కింది.కానీ, తిరిగి కిందకు దిగేందుకు దారి కనిపించక, భయంతో బిక్కమొహం వేసింది.
చెట్టు ఎత్తుగా ఉండటంతో ఆ చిన్నారి కుక్కపిల్ల ఒక్కతే దిగడం కష్టమైపోయింది.
కుక్కపిల్ల భయంతో చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని వణుకుతుండగా, ఊహించని విధంగా ఓ కోతి అక్కడికి వచ్చింది.ఆ కోతి ఎంతో తెలివిగా, ప్రేమగా కుక్కపిల్ల దగ్గరికి వెళ్లి, దాన్ని కిందకు దించేందుకు సాయం చేసింది.కోతి చూపించిన దయ, రక్షణ స్వభావం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు కోతి దయను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.కోతిని నిజమైన హీరో అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.“బజరంగబలియే స్వయంగా వచ్చి సాయం చేశాడనిపిస్తోంది” అంటూ ఒకరు కామెంట్ చేస్తే, “కోతి సోదరా నీకు జోహార్లు” అంటూ మరొకరు పొగిడారు.అయితే, కొందరు మాత్రం అక్కడున్న మనుషులు వీడియో తీస్తూ ఊరుకోవడంపై విమర్శలు చేస్తున్నారు.“మనిషి చేయాల్సిన పనిని జంతువులు చేస్తున్నాయి.వీడియో తీస్తున్న వాళ్లకు సిగ్గుండాలి” అని ఒక నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వీడియో దయ, ప్రేమ అనేవి మనుషులకే సొంతం కాదు అని చెప్పకనే చెబుతోంది.మూగజీవాల్లోనూ అవి పుష్కలంగా ఉంటాయని ఈ కోతి నిరూపించింది.కోతి చేసిన ఈ నిస్వార్థ సహాయం లక్షలాది మంది హృదయాలను గెలుచుకోవడమే కాకుండా, మానవత్వం, జాలి అనే అంశాలపై చర్చకు దారితీసింది.