తెలుగు సినిమా దర్శకులతో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి.అందరూ అద్భుతమైన సినిమాలు తీయడంలో దిట్టలే.
కొందరు ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ సినిమాలు తీస్తే.మరికొందరు ప్రేమకథలు తెరకు ఎక్కిస్తారు.
ఇంకొందరు పొలిటికల్ కథలు ఎంచుకుంటే.మరికొందరు సమాజంలో సమస్యలను కథగా ఎంచుకుంటారు.
ఎవరు ఏ అంశాల మీద దృష్టి పెట్టినా కథ అనేది సినిమాకు గుండె లాంటిది.కథలో దమ్ము ఉంటే.
బొమ్మ హిట్ కొట్టాల్సిందిలే.అయితే టాలీవుడ్ లో ముగ్గురు టాప్ దర్శకులు కథలు అస్సలు రాయరు.
ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది దర్శకులు తమ సినిమాలకు కథలు వారే రాసుకుంటారు.
కానీ కొందరు దర్శకులు కేవలం మేకింగ్ మీదే ఫోకస్ పెడతారు.స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
కథ రాయకపోయినా ఇతరులు రాసిన కథను తెరకెక్కించండంలో పక్కా సక్సెస్ అవుతారు.అలాంటి జాబితాలోకి నెంబర్ వన్ వివి వినాయక్.
మాస్, కమర్షియల్ సినిమాలు తీయడంలో ఈయనకు ఈయనే సాటి.సొంతంగా కథ రాయడం రాని వినాయక్ రచయితలు ఇచ్చిన కథను అద్భుతమైన రీతిలో తీస్తాడు.
సక్సెస్ సాదిస్తాడు.

సేమ్ ఇదే కోవకు చెందిన మరో దర్శకుడు సురేందర్ రెడ్డి.సినిమా పరిశ్రమలో లైట్ బాయ్ గా ప్రస్థానం మొదలు పెట్టి దర్శకుడిగా ఎదిగాడు.కల్యాణ్ రామ్ హీరోగా అతనొక్కడే సినిమా తీసి క్రేజీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత జూ.ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి తో హిట్ సినిమాలు చేశాడు.సొంతంగా కథ రాయరాకపోయినా రచయితలు చెప్పిన స్టోరీని తన మార్కు టేకింగ్ తో అద్భుతమైన రీతిలో సినిమా తీస్తాడు.
అటు మరో సక్సెస్ ఫుల్ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా రచయితల మీద ఆధారపడి సినిమాలు చేస్తాడు.తను అనుకున్న లైన్ ను రచయితలకు చెప్పి కథ రాయిస్తాడు.
లేదంటే వేరే వాళ్లు చెప్పిన కథలని సినిమాలుగా తీస్తాడు.వంశీ సక్సెస్ రేటు చాలా ఎక్కువ.
ఆయన ఎంచుకున్న కథను తెరకు ఎక్కించడంలో 100 శాతం విజయవంతం అవుతాడు.అయితే ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ దర్శకులు తమ సినిమా కథలను వారే రాసుకుంటున్నారు.