చలికాలం( Winter Season ) వచ్చిందంటే చాలు చర్మం చాలా డ్రై గా మారిపోతుంటుంది.ఎంత ఖరీదైన మాయిశ్చరైజర్ ను వాడిన సరే మళ్లీ కొన్ని గంటలకు చర్మం పొడి పొడిగా నిర్జీవంగా తయారవుతుంది.
ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టడానికి కొబ్బరిపాలు అద్భుతంగా సహాయపడతాయి.చలికాలంలో చర్మానికి కొబ్బరి పాలు అండగా నిలుస్తాయి.
కొబ్బరి పాలు( Coconut Milk ) సహజమైన మాయిశ్చరైజర్ లా పని చేస్తాయి.పలు చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో కూడా కొబ్బరి పాలను వాడతారు.
![Telugu Tips, Coconut Milk, Coconutmilk, Face Serum, Skin, Latest, Serum, Skin Ca Telugu Tips, Coconut Milk, Coconutmilk, Face Serum, Skin, Latest, Serum, Skin Ca](https://telugustop.com/wp-content/uploads/2024/01/Homemade-Coconut-Milk-Serum.jpg)
చలికాలంలో రోజు నైట్ కొబ్బరిపాలను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మీ ముఖ చర్మం మెరిసిపోవడం ఖాయం.అందుకోసం ముందుగా కొబ్బరి ముక్కలను మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేసి పాలు సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ) ను వేసుకోవాలి.అలాగే ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కొబ్బరి పాలు వేసుకోవాలి.
వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, నాలుగు చుక్కలు రోజ్మేరీ ఎసెన్షియల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా ఒక మంచి సీరం సిద్ధమవుతుంది.
![Telugu Tips, Coconut Milk, Coconutmilk, Face Serum, Skin, Latest, Serum, Skin Ca Telugu Tips, Coconut Milk, Coconutmilk, Face Serum, Skin, Latest, Serum, Skin Ca](https://telugustop.com/wp-content/uploads/2024/01/Try-this-coconut-milk-serum-for-hydrated-and-glowing-skin-in-winter.jpg)
ఈ సీరం ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే దాదాపు వారం రోజుల పాటు వాడుకోవచ్చు.రోజు నైట్ నిద్రించడానికి అరగంట ముందు ఫేస్ వాష్ చేసుకుని ఆపై తయారు చేసుకున్న సీరం ను ముఖానికి అప్లై చేసి కనీసం ఐదు నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజు కనుక చేస్తే మీ చర్మం మృదువుగా కోమలంగా మారుతుంది.చర్మం డ్రై అవ్వడం అన్నదే ఉండదు.కొబ్బరిపాలతో తయారుచేసిన ఈ న్యాచురల్ సీరం( Natural Face Serum ) ను వాడటం వల్ల చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది.కాంతివంతంగా మెరుస్తుంది చర్మంలో ఉండే సహజ నూనెలను సమతుల్యం చేయడంలోనూ ఈ సీరం మీకు సహాయపడుతుంది.