చాలా మంది ఈ హీరోయిన్స్ తమ జీవితంలో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా మనసుకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటారు.ప్రేమ ఒక రకంగా గుడ్డిది అంటూ ఉంటారు.
ప్రేమలో పడితే స్థాయి, అంతస్థు లాంటివి ఏమి గుర్తుకు రావు.హీరోయిన్స్ విషయంలో ఇది పూర్తి స్థాయిలో నిజం.
తాము ప్రేమించిన వ్యక్తి తమ స్థాయిలో ఉన్నాడా లేదా అనే విషయం కూడా ఆలోచించరు.మనసుకు నచ్చితే చాలు మనువుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
అలా స్టార్ హీరోయిన్స్ చలామణి అవుతూ సదా సీదా సీరియల్ నటులను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం.
ఇంద్రజ

ఇంద్రజ సౌత్ ఇండియాలోనే ఒక రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.ఆమె హీరోయిన్ గా కెరియర్ ముగిసిపోయాక బుల్లితెరపై సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది.అలా తనతో పాటు నటించిన తన తోటి నటుడు అబ్సర్( Abser ) ని ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలైంది.
ప్రస్తుతం సీరియల్స్ తో పాటు రియాలిటీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది.
సీత

సీత( Sita ) హీరోయిన్ గా చాలా ఏళ్లపాటు ఏకచిత్రాధిపత్యం చేసింది.ఆమె నటుడు పార్థిబన్( Parthiban ) ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లయ్యాక విడిపోయింది.ఆ తర్వాత ఆమె బుల్లితెరపై సీరియల్స్( Serials on television ) లో చాలా ఏళ్ల పాటు నటించింది.
అలా తనతో పాటు నటిస్తున్న సమయం లోనే సతీష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.కానీ ఆ తర్వాత వీరు కూడా విడిపోయారని అంటూ ఉంటారు.
కానీ సతీష్ ఒక ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమం లో తమకు పెళ్లి కాలేదు అంటూ ప్రకటించాడు.
దేవదర్శిని

ఫుల్ స్టార్ డం లో ఒక వెలుగు వెలుగుతున్న నటి దేవదర్శని( Actress Devdarshani ).మర్మదేశం అనే బుల్లితెర సీరియల్ లో నటిస్తున్న క్రమంలో తన తోటి నటుడైన చైతన్( Chaitan ) అనే వ్యక్తితో ప్రేమలో పడింది, ఆ తర్వాత వారి పెళ్లి ప్రేమ పెళ్లికి దారి తీసింది.వీరికి ఒక అమ్మాయి కూడా ఉంది.