ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న పిల్లలు చదివినది గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.దీని వల్ల చిన్నపిల్లలకు( Childrens ) పరీక్షలలో తక్కువ మార్కులు వస్తున్నాయి.
అందుకోసం వారికి జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాన్ని ఇవ్వడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.రోజూ కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల జ్ఞాపక శక్తిపై సానుకూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రతిరోజు కొన్ని ప్రత్యేక ఆహారాలు తినిపించడం వల్ల వారి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఎరుపు ద్రాక్ష,( Red Grapes ) నీలం, ఊదా, బెర్రీలు జ్ఞాపకశక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

వీటి నుంచి తీసినా రసాన్ని పిల్లలకు రోజు తాగిస్తే జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంది.అల్జీమర్స్ తో బాధపడుతున్న వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.ముఖ్యంగా చెప్పాలంటే బ్లూ బెర్రీ ( Blue Berries )తినిపించడం వల్ల వారి మెదడు పనితీరు ఎంతగానో మెరుగుపడుతుంది.దానివల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.ద్రాక్ష, బెర్రీలలో జ్ఞాపకశక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి.వీటిలో అంథోసైనింగ్స్ అనే పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి.
ఇవి మెదడుకు ఎక్కువగా పోషకాలు ఆక్సిజన్ ను అందిస్తాయి.దీనివల్ల మెదడు వేగంగా పనిచేస్తుంది.
ముఖ్యంగా చెప్పాలంటే క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ తినే పిల్లలు చదువులో మెరుగ్గా రాణిస్తారని ఒక అధ్యయనంలో తెలిసింది.

చేపల ను తినడం వల్ల కూడా జ్ఞాపకశక్తి ( memory )మెరుగుపడుతుంది. చేపల( fish )లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి మెదడు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
అంతే కాకుండా బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్ నట్స్, ఎండుద్రాక్ష లను కూడా ప్రతిరోజు పిల్లలకు తినిపించాలి.వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
అంతేకాకుండా వాటితో పాటు సెలీనియం, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి.దీనివల్ల నరాలు సక్రమంగా పనిచేస్తాయి.
ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.ఇంకా చెప్పాలంటే బ్రౌన్ రైస్ పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా ఎంతో మంచిది.
ఇది గుండె, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.