వేసవి కాలంలో అధికంగా నిమ్మరసం తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..

వేసవికాలంలో ఎండలకు, వేడికి శీతల పానీయాలు తాగాలనిపిస్తూ ఉంటుంది.అయితే బయట దొరికే రెడీమేడ్ జ్యూస్ లను తాగే కన్నా ఇంట్లోనే నిమ్మరసం తయారు చేసుకుని తాగుచ్చని చాలామంది అనుకుంటూ ఉంటారు.

 Drinking Too Much Lemon Juice During Summer But These Problems Are Inevitable ,-TeluguStop.com

అందుకే వేసవిలో చాలామంది నిమ్మరసాన్ని ఎక్కువగా తాగుతూ ఉంటారు.కానీ చాలామందికి నిమ్మరసం తాగడం వలన కలిగే దుష్పరిమానాల గురించి అస్సలు తెలియదు.

ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.అలాగే బరువును నియంత్రిస్తుంది.

జీర్ణక్రియ సమస్యలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.

కానీ నిమ్మకాయ( lemon ) నీటిని అతిగా తీసుకోవడం వలన శరీరానికి హాని కూడా కలుగుతుంది.

ఎందుకంటే ఇది ప్రోటీన్ బ్రేకింగ్ ఎంజైమ్( Protein breaking enzyme ) పెప్సిన్ ను సక్రీయం చేస్తుంది.అలాగే పెప్టిక్ అల్సర్ ( Peptic ulcer )యొక్క పరిస్థితి దాని అధిక వినియోగం కారణంగా ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది.

ఎక్కువగా నిమ్మరసం తాగడం వలన డిహైడ్రేషన్ రావచ్చు.నిమ్మరసం తాగినప్పుడు అది మూత్రం ద్వారా శరీరాన్ని నిర్వీకరణ చేస్తుంది.ఈ ప్రక్రియలో అనేక ఎలక్ట్రోలైట్లు, సోడియం లాంటి మూలకాలు మొత్తం మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.దీంతో మీకు డిహైడ్రేషన్ సమస్య రావచ్చు.

అలాగే నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వలన పొటాషియం లోపం కూడా ఏర్పడుతుంది.

Telugu Tips, Lemon, Peptic Ulcer, Problems, Protein Enzyme-Telugu Health

ఎందుకంటే విటమిన్ సి అధికంగా ఉండటం వలన రక్తంలో ఐరన్ స్థాయిలు అధికంగా పెరుగుతాయి.ఇలా పెరగడం చాలా ప్రమాదకరం.మీ అంతర్గత అవయవాలకు ఇది హాని కలిగించవచ్చు.

అంతేకాకుండా నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.చాలా ఆక్సెలెట్ కూడా ఉంటుంది.

దీన్ని అధిక వినియోగం స్పటికాల రూపంలో శరీరంలో పేరుకుపోతుంది.దీంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.

లెమన్ వాటర్ ఎక్కువగా తాగడం వలన ఎముకలు కూడా బలహీన పడిపోతాయి.

Telugu Tips, Lemon, Peptic Ulcer, Problems, Protein Enzyme-Telugu Health

ఎందుకంటే నిమ్మకాయలో ఆమ్లత్వం ఉంటుంది.ఇది ఎముకలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.నిమ్మరసం ఎక్కువగా తాగడం వలన ఎసిడిటీ లాంటి సమస్యలు కూడా వస్తాయి.

ఎందుకంటే నిమ్మకాయల్లో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.దీన్ని తీసుకోవడం వలన శరీరంలో ఆసిడ్ పరిమాణం పెరుగుతుంది.

ఇక టానిల్స్ సమస్య ఉన్నవారు లెమన్ వాటర్ ను తాగడం అస్సలు మంచిది కాదు.ఇలాంటి వారు నిమ్మరసాన్ని తాగితే ఆరోగ్యానికి మరింత హానికరం.

ఇక ఒక పరిశోధన ప్రకారం నిమ్మకాయ నీటిని అధికంగా తీసుకోవడం వలన గొంతు నొప్పి కూడా వస్తుందని తేలింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube