భోజనానికి ముందు పండ్లు తింటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే!

మనకు ఈ ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆహారాల్లో పండ్లు ఒకటి.పండ్ల లోనే ఎన్నో రకాలు ఉన్నాయి.

 Don't Make These Mistakes Before And After Meals! Meal, Healthy Meal, Health, He-TeluguStop.com

నిత్యం రెండు రకాల పండ్లను తీసుకుంటే అనేక జబ్బులకు దూరంగా ఉండవచ్చని వైద్యులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు.పండ్లు ఆరోగ్యానికి మంచిదే.

కానీ అది తీసుకునే సమయం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది.ఎప్పుడు పడితే అప్పుడు పండ్లు( Fruits ) తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయి.

ముఖ్యంగా భోజనానికి ముందు పండ్లను అస్సలు తినకూడదు.

Telugu Fruits, Tips, Healthy Meal, Latest, Meal-Telugu Health

అలాగే భోజనం చేసిన వెంటనే కూడా పండ్లు తీసుకోరాదు.భోజనానికి ముందు లేదా త‌ర్వాత ఫ్రూట్స్ ను తింటే వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అదే స‌మ‌యంలో పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోతుంది.

దీంతో నాజూగ్గా ఉండాల్సిన మీ పొట్ట బానలా తయారవుతుంది.కాబట్టి భోజనానికి ముందు లేదా తర్వాత ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటే ఇకపై మానుకోండి.

Telugu Fruits, Tips, Healthy Meal, Latest, Meal-Telugu Health

అలాగే భోజనం చేసిన వెంటనే కాసేపు నడిస్తే మంచిదని చాలా మంది చెబుతుంటారు.కానీ అలా అస్సలు చేయకూడదు.భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేస్తే తిన్న ఆహారంలో పోషకాలను జీర్ణ వ్యవస్థ( Digestive system ) గ్రహించలేదు.అందుకే తిన్న వెంటనే వాకింగ్ చేయకండి.ఒక అరగంట లేదా గంట తర్వాత చేస్తే మంచిది.కొందరికి భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది.

మీరు ఇలా చేస్తారా.అయితే డేంజర్ లో పడ్డట్టే.

భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పై చెడు ప్రభావం పడుతుంది.తిన్న ఆహారం త్వరగా అరగదు.

గ్యాస్, ఎసిడిటీ( Acidity ), మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.మరియు రక్తపోటు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి.

ఇక భోజనం తర్వాత స్నానం చేయడం, వెంటనే నిద్ర పోవడం వంటివి కూడా చేయకండి.ఇలాంటి చిన్న చిన్న త‌ప్పులే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అనేక అనారోగ్య సమస్యల‌ను తెచ్చిపెడ‌తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube