జుట్టును ఒత్తుగా ఆరోగ్యంగా మార్చుకోవాలి అనుకుంటున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను రాసుకుంటే నెల రోజుల్లో మీ జుట్టు రెండింతలు అవుతుంది.మరి ఇంతకీ ఆ మ్యాజికల్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
అది అందించే ప్రయోజనాలు ఏంటి.అన్న విషయాలు తెలుసుకుందాం పదండి.
ముందుగా అంగుళం అల్లం ముక్క( ginger ) తీసుకుని పీల్ తొలగించి సన్నగా తురుముకుని పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో ఒక కప్పు కరివేపాకు( curry leaves ) వేసుకోవాలి.
మరియు రెండు స్పూన్లు నువ్వులు( Sesame seeds ), వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( Kalonji Seeds ), నాలుగు లవంగాలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె వేసుకోవాలి.
అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమంతో పాటు అల్లం తురుము కూడా వేసి చిన్న మంటపై దాదాపు 15 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉడికించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న నాలుగు గంటల తర్వాత లేదా మరుసటి రోజు మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు కుదుళ్లకు చక్కని పోషణ అందుతుంది.మూలాల నుంచి కురులు బలోపేతం అవుతాయి.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.కేవలం నెల రోజుల్లోనే మీ జుట్టు దట్టంగా మారుతుంది.అలాగే హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్ వంటి సమస్యలు దూరం అవుతాయి.
జుట్టు ఆరోగ్యంగా దృఢంగా మారుతుంది.కాబట్టి ఆరోగ్యమైన, దట్టమైన కురులను కోరుకునేవారు తప్పకుండా ఈ మ్యాజికల్ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.