వర్షాకాలం అంటేనే రోగాల మయం.ఇన్ఫెక్షన్స్, అలర్జీలు, జలుబు, దగ్గు, మలేరియా, డెంగ్యూ వంటి ఎన్నో వ్యాధులు ఈ సీజన్ లోనే అధికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
అందకే వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతుంటాయి.ముఖ్యంగా తీసుకునే ఆహారం పట్ల ఎన్నో నియమాలను పాటించాలి.
అందులో ఒకటే నాన్ వెజ్ కు దూరంగా ఉండటం.వర్షాకాలంలో నాన్ వెజ్ ను ఎవైడ్ చేయమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
కానీ, కొందరికి ముక్క లేనిదే ముద్దు తిగదు.అయినప్పటికీ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే నాన్ వెజ్ ను పక్కన పెట్టాల్సిందే. అసలెందుకు వర్షాకాలంలో నాన్ బెజ్ తినరాదు.? తింటే వచ్చే సమస్యలు ఏంటీ.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో సహజంగానే జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది.
అయితే నాన్ వెజ్ హై ప్రోటీన్ ఫుడ్.అందువల్ల, దీన్ని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మరింత బలహీన పడుతుంది.
ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, కడుబు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తరచూ ఇబ్బంది పెడతాయి.

ఈ సీజన్ లో కురిసే వర్షాల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్, ఫంగస్, బాక్టీరియా వంటివి ఎక్కువగా వృద్ధి చెందుతుంటాయి.ఇవి మాంసాహారం ద్వారా కూడా వ్యాపించే అవకాశాలు ఉంటాయి.అలాగే వర్షాకాలంలో కీటకాల వ్యాప్తి అధికంగా ఉండటం వల్ల జంతువులు అనారోగ్యానికి గురవుతాయి.
అటువంటి వాటిని తింటే జబ్బుల బారిన పడతారు.అందుకే వర్షాకాలంలో ఆరోగ్య నిపుణులు నాన్ వెజ్ జోలికి పోవద్దని సూచిస్తుంటారు.
ఇక వర్షాకాలంలో నాన్ వెజ్ మాత్రమే కాదు పచ్చి కూరగాయలు, స్ట్రీట్ ఫుడ్స్, ఆకు కూరలు, నూనెలో వేయించిన ఆహారాలు, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్‌లు, కూల్ డ్రింక్స్, వేపుళ్లు, స్పైసీ ఫుడ్స్ వంటి వాటిని కూడా ఎవైడ్ చేయాలి.