Bhumika Chawla : టాలీవుడ్ అగ్రహీరోలకు కెరీర్ నిలబెట్టిన ఒకే ఒక్క హీరోయిన్.. ఎవరంటే…

ప్రస్తుతం టాలీవుడ్‌లో( Tollywood ) అనేకమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, నంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతున్న ముగ్గురు హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్( Pawan Kalyan, Mahesh Babu, Jr NTR ) అని చెప్పవచ్చు.ఈ హీరోలు తమ కెరీర్‌లో అనేక సూపర్ హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు తమ ఖాతాలో వేసుకున్నారు.

 Bhumika Is The Only Heroine For All Heros-TeluguStop.com

అంతేకాకుండా, వారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అనేక ఇండస్ట్రీ హిట్స్‌ను కూడా అందించారు.

మహేష్ బాబు పోకిరి, శ్రీమంతుడు, ఒక్కడు వంటి హిట్ చిత్రాల్లో నటించాడు.

పవన్ కళ్యాణ్ బద్రి, తమ్ముడు, ఖుషి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి పవర్ స్టార్ గా ఎదిగాడు.జూనియర్ ఎన్టీఆర్ ఆది, సింహాద్రి, బృందావనం, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల్లో నటించి టాప్ హీరో అయ్యాడు.

ఈ ముగ్గురు హీరోల కెరీర్‌లో వారిని స్టార్‌లుగా మార్చిన సినిమాలు మూడు ఉన్నాయి.ఈ చిత్రాల్లోని విశేషమేమిటంటే, ఈ మూడు చిత్రాల్లో హీరోయిన్ ఒకరే.ఆమే భూమిక చావ్లా( Bhumika Chawla ).

Telugu Badri, Bhumika, Bhumika Chawla, Delhi, Jr Ntr, Khushi, Mahesh Babu, Pawan

భూమిక చావ్లా 1978లో ఢిల్లీలో ( Delhi )జన్మించింది.ఆమె 1997లో యువకుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయింది.తరువాత తమిళం, హిందీ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది.

భూమిక చావ్లా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి నటించిన ఖుషి, ఒక్కడు, సింహాద్రి ( Simhadri )వంటి సినిమాలు విజయవంతమయ్యాయి.ఈ ముద్దుగుమ్మ అద్భుతంగా యాక్ట్ చేసి చాలామంది ప్రేక్షకులను థియేటర్లకు పెద్ద ఎత్తున రప్పించడంలో కీలక పాత్ర పోషించింది.

ఒక్కడు సినిమాలో చూసుకున్నా, ఖుషి మూవీలో చూసినా ఈ ముద్దుగుమ్మ లుక్స్ అద్భుతంగా ఉంటాయి.అంతేకాదు ఆమె పాత్రలు కూడా సూపర్ గా ఉంటాయి.ఎప్పటికీ మర్చిపోలేని పాత్రలు పోషించిందీ ఈ క్యూట్ బ్యూటీ.ఈ సినిమాల విజయంలో హీరో పాత్ర ఎంతుందో హీరోయిన్ పాత్ర కూడా అంతే ఉందని చెప్పొచ్చు.

Telugu Badri, Bhumika, Bhumika Chawla, Delhi, Jr Ntr, Khushi, Mahesh Babu, Pawan

భూమికని కాకుండా ఆ మూడు సినిమాలలో వేరే వారిని తీసుకున్నట్లయితే అవి పెద్దగా ఆడి ఉండకపోయేవి.ఆ విధంగా చూసుకుంటే భూమిక ముగ్గురు స్టార్ హీరోలకి మంచి లైఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు.ఈ సినిమాలు భూమిక చావ్లాకు గోల్డెన్ లెగ్ హీరోయిన్‌గా పేరు కూడా తెచ్చిపెట్టాయి.భూమిక చావ్లా ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఉంది.ఆమె కొన్ని సినిమాలలో ముఖ్య పాత్రలలో నటిస్తూ మెప్పిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube