ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన కూరగాయల్లో క్యారెట్( Carrot ) ఒకటి.దుంప జాతికి చెందిన క్యారెట్ ను చాలామంది పచ్చిగానే తింటూ ఉంటారు.
ఇంకొందరు క్యారెట్ తో రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు.క్యారెట్ తో చేసే హల్వా ఎంతో మందికి మోస్ట్ ఫేవరెట్ స్వీట్ అని చెప్పవచ్చు.
ఇకపోతే పోషకాలకు క్యారెట్ పవర్ హౌస్ లాంటిది.క్యారెట్ లో అనేక రకాల విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి.
అందువల్ల ఆరోగ్యానికి క్యారెట్ చాలా మేలు చేస్తుంది.
ముఖ్యంగా క్యారెట్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మరిన్ని ఎక్కువ బెనిఫిట్స్ పొందుతారు.అందుకోసం బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి.అలాగే పది నైట్ అంతా నానపెట్టి పొట్టు తొలగించిన బాదం గింజలు,( Almonds ) ఐదు నైట్ అంతా నానబెట్టుకున్న జీడిపప్పు,( Cashew ) రెండు గింజ తొలగించిన సాఫ్ట్ డేట్స్, పావు టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పసుపు మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
తద్వారా ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన క్యారెట్ మిల్క్ షేక్( Carrot Milkshake ) రెడీ అవుతుంది.
వారానికి కనీసం రెండు సార్లు ఈ క్యారెట్ మిల్క్ షేక్ ను తీసుకోవడం వల్ల నీరసం, అలసట వంటివి మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.కంటి చూపు పెరుగుతుంది.దృష్టి లోపాలకు దూరంగా ఉంటారు.జీర్ణవ్యవస్థ చురుగ్గా పని చేస్తుంది.అలాగే ఈ క్యారెట్ మిల్క్ షేక్ కాలేయంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపి కొవ్వు మరియు పిత్తాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
బలమైన ఎముకలను నిర్మించడానికి తోడ్పడే కాల్షియం ఈ క్యారెట్ మిల్క్ షేక్ లో మెండుగా ఉంటుంది.
పిల్లలు, పెద్దలు ఈ పానీయాన్ని తీసుకుంటే ఎముకలు, కండరాలు దృఢంగా ఉంటాయి.అంతేకాదు ఈ క్యారెట్ మిల్క్ షేక్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి.
కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తాయి.