స్థలం పెద్దగా ఉంటే నాలా తూర్పు దిశలో వచ్చేలా విభాగం చేసుకోవాలి.అంటే తూర్పు పడమర భాగాలుగా స్థలాన్ని విడగొట్టి పడమర భాగంలో ఇల్లు కట్టాలి.
అప్పుడు ఆ నాలా మీ ఇంటికి తూర్పు అవ్వాలి.ఆ నాల తూర్పు అంచున ఇంటి తూర్పు కాంపౌండ్ కట్టాలి.
ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే మన దేశంలో చాలా మంది వాస్తును కచ్చితంగా ఇలానే పాటిస్తారు.అలాగే తమ ఇంటిలోనీ వస్తువులను కూడా వాస్తు ప్రకారమే అమర్చుకుంటూ ఉంటారు.
div class=”middlecontentimg”>
ముఖ్యంగా చెప్పాలంటే గృహం మధ్యలో దేవుళ్ళ విగ్రహాలు(G ods ) పెట్టవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.దేవుళ్ళ విగ్రహాలు గృహం మధ్యలో పెట్టవచ్చా, పెట్టకూడదా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పండితులు చెప్పిన దానీ ప్రకారం గృహం గర్భస్థలంలో ఖాళీ స్థలం ఉండాలి.బుద్ధ విగ్రహాలు, చెట్లు, ఫౌంటెయిన్, శిఖరాలు కట్టడం, పెట్టడం మంచిది కాదు.హాలు అనేది ఇంటికి నాభి స్థానంలో వస్తుంది.అది విగ్రహాల స్థాపనకు కాదు.
అలాంటివి మీరు పెట్టుకోవాలంటే అది దేవుళ్ళ విగ్రహాలు కావచ్చు.
div class=”middlecontentimg”>
ఇతరత్రావిగ్రహాలు కూడా కావచ్చు.ఇవి ఇంటి నాభిని తప్పించి అటు పడమర భాగానికి కానీ, ఇటు దక్షిణ భాగానికి కానీ జరిపి నిలబెట్టుకోవాలి.చెవికి రింగు వేసినట్టు నాలుకకు రంధ్రం చేసి లోలాకులు వేస్తామంటే ఎంత భీభత్సమో, గృహం నాభి లో అందాల కోసం కట్టడాలు చేస్తే కూడా అంతే చెడు ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు.
గృహం జీవాహితంగా కనిపించేలా ఉండాలి.కాబట్టి ఆ విషయాన్ని వివేకంతో అర్థం చేసుకొని తగిన నిర్ణయాలు తీసుకోవాలి.లేకపోతే మీ అర్థం లేని ఆలోచనలు కుటుంబ మనశ్శాంతిని దెబ్బతిస్తాయని పండితులు చెబుతున్నారు.